Share News

వంద మంది విద్యార్థులు ఉండాలి

ABN , Publish Date - Jul 25 , 2025 | 11:12 PM

జిల్లాలోని సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాల్లో వంద మంది విద్యార్థులు అడ్మిషన్లు విధిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఏఎ్‌సడబ్లూవోలను, వార్డెన్లను జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ సాధికారిత అధికారి బి.రాధిక ఆదేశించారు.

వంద మంది విద్యార్థులు ఉండాలి
మాట్లాడుతున్న జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ సాధికారిత అధికారి బి.రాధిక

అడ్మిషన్ల సంఖ్య పెంచాలి

భోజన మెనూలో తేడాలు వస్తే ఉపేక్షించం

జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ సాధికారిత అధికారి బి.రాధిక

కర్నూలు ఎడ్యుకేషన్‌, జూలై 25 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాల్లో వంద మంది విద్యార్థులు అడ్మిషన్లు విధిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఏఎ్‌సడబ్లూవోలను, వార్డెన్లను జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ సాధికారిత అధికారి బి.రాధిక ఆదేశించారు. శుక్రవారం స్థానిక కార్యాలయంలో ఏఎ్‌సడబ్లూవోలు(సహాయ సంక్షేమ అధికారులను), వార్డెన్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలోని హాస్టళ్లలో 50 మంది కంటే తక్కువగా ఉన్నారని అన్నారు. అడిష్మన్ల సంఖ్య పెంచాలని ఆదేశించారు. విద్యార్థులకు భద్రత కల్పిస్తూ వారి చదువుపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. విద్యార్థులకు అందించే భోజన మెనూలో ఎట్టి పరిస్థితుల్లో తేడాలు ఉండరాదని, ఒకవేళ తేడాలు వస్తే ఎవరినీ ఉపేక్షించబోమన్నారు. హాస్టల్‌ వార్డెన్లు, నాలుగో తరగతి ఉద్యోగులు పని చేసే చోటనే నివాసముంటూ విద్యార్థులకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. వసతి గృహాల్లోని విద్యార్థుల మధ్య ర్యాగింగ్‌ వంటి వి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. బాలికల వసతిగృహాలకు పెట్రోలింగ్‌ జరిగేలా ఆయా పోలీస్‌స్టేషన్ల్‌ను సంప్రదించి పోలీసుల సహకారం పొందాలన్నారు. సమావేశంలో సహాయ సంక్షేమ శాఖ అధికారులు బి.మద్దిలేటి, బాబు, లీలావతి, హాస్టల్‌ వార్డెన్లు సుంకన్న, మదాసిర్‌, మల్లికార్జున, రజని, సులోచన పాల్గొన్నారు.

Updated Date - Jul 25 , 2025 | 11:12 PM