భూసేకరణలో ఇబ్బందులు లేకుండా చూడాలి: కలెక్టర్
ABN , Publish Date - Sep 18 , 2025 | 11:24 PM
జిల్లా అభివృద్ధి పారిశ్రామిక ప్రగతి కోసం చేపట్టే భూసేకరణలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కలెక్టర్ రాజకుమారి రెవెన్యూ అధికారులను ఆదేశించారు.
నంద్యాల ఎడ్యుకేషన్, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): జిల్లా అభివృద్ధి పారిశ్రామిక ప్రగతి కోసం చేపట్టే భూసేకరణలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కలెక్టర్ రాజకుమారి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ చాంబర్‌లో జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్‌తో కలిసి కలెక్టర్ రెవెన్యూ అధికారులతో సమావేశం అయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వివిధ పరిశ్రమలు, విద్యాసంస్థలు, సంక్షేమ వసతి గృహాల ఏర్పాటుకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. భూసేకరణలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్షేత్రస్థాయిలో రైతులు, అసైన్‌దారులతో సమన్వయం చేసుకుని స్పష్టమైన నివేదికలు పంపాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలో కుసుమ్ ప్రాజెక్ట్ కోసం మిడ్తూరులో 162 ఎకరాలు, కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్రాజెక్టుల కోసం రుద్రవరం, చాగలమర్రి, ఆళ్లగడ్డ ప్రాంతాల్లో 315 ఎకరాలు కేటాయించినట్లు తెలిపారు. ఇంటిగ్రేటెడ్ రెన్యువల్ ఎనర్జీ ప్రాజెక్టు కోసం డోన్, బేతంచర్ల ప్రాంతాల్లో 2,860 ఎకరాలు, ఎంఎ్‌సఎంఈ ప్రాజెక్టు కోసం సుగాలిమెట్టలో 49 ఎకరాలను కేటాయించినట్లు తెలిపారు. జరిగగిందన్నారు. భూసేకరణకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న అంశాలను త్వరితగతిన పరిష్కరించి పెట్టుబడులు, పరిశ్రమలు సజావుగా సాగేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. సమావేశంలో డీఆర్‌వో రామునాయక్‌చ నంద్యాల, డోన్, ఆత్మకూరు, ఆర్డీవోలు విశ్వనాధ్, నరసింహులు, నాగజ్యోతి తదితరులు పాల్గొన్నారు.