Share News

సమస్యల పరిష్కారంలో జాప్యం తగదు

ABN , Publish Date - Jul 08 , 2025 | 12:39 AM

ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు జాప్యం చేయవద్దని కలెక్టర్‌ రాజకుమారి ఆదేశించారు. సోమవారం పీజీఆర్‌ఎస్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టర్‌ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి పలు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు.

సమస్యల పరిష్కారంలో జాప్యం తగదు
ప్రజల సమస్యలు తెలుసుకుంటున్న కలెక్టర్‌ రాజకుమారి

కలెక్టర్‌ రాజకుమారి

నంద్యాల ఎడ్యుకేషన్‌, జూలై 7 (ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు జాప్యం చేయవద్దని కలెక్టర్‌ రాజకుమారి ఆదేశించారు. సోమవారం పీజీఆర్‌ఎస్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టర్‌ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి పలు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. మిడ్తూరు గ్రామానికి చెందిన వెంకటలక్ష్మమ్మ తన భర్త చనిపోయి రెండుసంవత్సరాలు గడిచినా తనకు పింఛన్‌ రాలేదని కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఉయ్యాలవాడ గ్రామా నికి చెందిన రామానాయుడు తనకు ఇంజేడు గ్రామ పరిధిలో 2.15 ఎకరాల భూమి ఉందని, రీ సర్వేలో తన సర్వే నంబర్‌పై మరో రైతు భూమిని కలి పారని కలెక్టర్‌కు విన్నవించుకున్నారు. బనగానపల్లె మండలం నందవరం గ్రామానికి చెందిన సత్యనారాయణరెడ్డి తాను కొన్న భూమి రిజిస్ర్టేషన్‌ సమయంలో డిజిటల్‌ లాక్‌ తొలగించారని ఫిర్యాదు చేశారు. ఇలా గ్రీవెన్స్‌కు 221 మంది అర్జీలు అందజేశారు.

Updated Date - Jul 08 , 2025 | 12:39 AM