టికెట్లు అమ్ముకునే సంస్కృతి లేదు
ABN , Publish Date - Nov 05 , 2025 | 11:52 PM
నిబద్ధత, క్రమశిక్షణ కలిగిన పార్టీ తెలుగుదేశం పార్టీలో ప్రజామోదం కలిగిన నాయకులకే టికె ట్లు ఇస్తారని, టికెట్లను అమ్ముకొనే సంస్కృతి లేద ని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య, ఆహారశుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు.
టీడీపీలో కష్టపడే కార్యకర్తలకు సముచిత స్థానం
రాష్ట్ర మంత్రి టీజీ భరత్
కర్నూలు, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): నిబద్ధత, క్రమశిక్షణ కలిగిన పార్టీ తెలుగుదేశం పార్టీలో ప్రజామోదం కలిగిన నాయకులకే టికె ట్లు ఇస్తారని, టికెట్లను అమ్ముకొనే సంస్కృతి లేద ని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య, ఆహారశుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మరో ఏడాది వరకు నగరపాలక సంస్థ ఎన్నికల్లేనందున అభ్యర్థుల ఎంపిక సమస్యే లేదని తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీని ఎదుర్కొనే దైర్యం లేక టీడీపీ కార్యకర్తల ఆత్మస్థైర్యం దెబ్బతీసేందుకు రాజకీయ కుట్రలో భాగంగానే కొందరు తప్పడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. టీడీపీకి, టీజీ కుటుంబానికి డబ్బులకు టికెట్లు అమ్ముకునే సంస్కృతి లేదని అన్నారు.