రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
ABN , Publish Date - Nov 29 , 2025 | 12:33 AM
రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని కలెక్టర్ రాజకుమారి గనియ అన్నారు.
కలెక్టర్ రాజకుమారి
గ్రామాల్లో ‘రైతన్న మీకోసం’
దొర్నిపాడు, నవంబరు 28(ఆంధ్రజ్యోతి): రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని కలెక్టర్ రాజకుమారి గనియ అన్నారు. శుక్రవారం మండలం లోని గుండుపాపల గ్రామంలో చేపట్టిన రైతన్న మీకోసం కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. నీటి భధ్రత, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రిటెక్, ఫుడ్‌ప్రాసెసింగ్, అన్నదాత సుఖీభవ ద్వార రైతులకు మద్దతు ధర వంటి కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టిందని అన్నారు. ఎనఆర్‌ఈజీఎస్ ద్వారా రైతులు తమ పొలంలో నీటి కుంటలు, డ్రిప్, స్ర్పెయర్లు, సబ్సిడీ ద్వారా అందిస్తారని అన్నారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన రైతన్న మీకోసం కార్యక్రమంలో పాల్గొని రైతులతో మాట్లాడారు. కార్యక్రమంలో కోవెలకుంట్ల వ్యవసాయ సంచాలకుడు సుధాకర్, ఎంపీడీవో సావిత్రి, తహసీల్దార్ సుభద్ర, ఈవోపీఆర్డీ శివప్రసాద్, వ్యవసాయాధికారి ప్రమీల, పశువైద్యాధికారి శ్రీనివాసరెడ్డి, సర్పంచ వెంకటేశ్వర్లు, రమణ పాల్గొన్నారు.
బనగానపల్లె: రైతుల సంక్షేమ కూటమి ప్రభుత్వ లక్ష్యమని టీడీపీ నాయకుడు సుధాకర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం అప్పలాపురం గ్రామంలో రైతన్న మీకోసం కార్యక్రమం పశువైద్యసహాయ సంచాలకుడు మారుతిస కారం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇంటింటికి తిరిగి కూటమి ప్రభుత్వం రైతులకు అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. సుధాకర్‌రెడ్డి మా ట్లాడుతూ సీఎం చంద్రబాబు రైతుల కోసం అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన నిధులు సకాలంలో వారి ఖాతాలో జమ చేశారన్నారు. ఈసందర్భం గా ఇంటింటికి వెళ్లి కరపత్రాలు రైతులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో గ్రామ రైతులు, పశువైద్య సిబ్బంది హుసేన, అనిల్‌కుమార్ పాల్గొన్నారు.
చాగలమర్రి: రైతులను ఆదుకోవడమే ప్రభుత్వ లక్ష్యమని టీడీపీ మండల కన్వీనర్ నరసింహారెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని బ్రాహ్మణపల్లె, మల్లేవేముల గ్రామాల్లో రైతన్న మీకోసం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏవో రంగనేతాజీ, ఏఈవో మంజుల, టీడీపీ నాయకులు రామకృష్ణారెడ్డి, బాబయ్య, లూక, రైతులు పాల్గొన్నారు.
డోన రూరల్: రైతుల ప్రయోజనాలకే కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని వాల్మీకి కార్పొరేషన రాష్ట్ర డైరెక్టర్ వలసల రామకృష్ణ అన్నారు. శుక్రవారం సాయంత్రం మండలంలోని వలసల గ్రామంలో రైతన్న మీ కోసం కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఉద్యాన శాఖాధికారి క ళ్యాణి, టీడీపీ నాయకులు సుధాకర్, లక్ష్మన్న, రమణ, రామకృష్ణ పాల్గొన్నారు.