Share News

టీజీపీ కాల్వకు గండి పడలేదు

ABN , Publish Date - Oct 26 , 2025 | 11:30 PM

: మండలంలోని డి.వనిపెంట గ్రామ సమీపంలో 84 కి.మీ సమీపంలో ప్రధాన కాలువ కుంగి పడిందన్న విషయం తెలుసుకున్న టీజీపీ(తెలుగు గంగ ప్రాజెక్టు) కాలువను ఎస్‌ఈ ప్రతాప్‌ ఆదివారం పరిశీలించారు.

టీజీపీ కాల్వకు గండి పడలేదు
అధికారులతో చర్చిస్తున్న ఎస్‌ఈ ప్రతాప్‌

ఎస్‌ఈ ప్రతాప్‌

చాగలమర్రి, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): మండలంలోని డి.వనిపెంట గ్రామ సమీపంలో 84 కి.మీ సమీపంలో ప్రధాన కాలువ కుంగి పడిందన్న విషయం తెలుసుకున్న టీజీపీ(తెలుగు గంగ ప్రాజెక్టు) కాలువను ఎస్‌ఈ ప్రతాప్‌ ఆదివారం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ టీజీపీ ప్రధాన కాల్వకు గండి పడలేదన్నారు. అండర్‌ టర్నల్‌ వద్ద లీకేజీ అవుతుందన్నారు. ఐదు క్యూసెక్కుల నీరు మాత్రమే బోర్‌వెల్‌ ద్వారా బయటకు పోయేలా ఏర్పాటుచేశామన్నారు. మరమ్మతుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. వర్షపు నీరు లోపలికి ప్రవేశించకుండా నాలుగు అడుగుల కింద బోర్‌వెల్‌ ఉంటాయని అన్నారు. వెలుగోడు బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌లో 16 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు. టీజీపీ కాలువలో 5వేల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తుందని అన్నారు. ఆయన వెంట టీజీపీ ఈఈలు మురళీకృష్ణ, శివశంకర్‌రెడ్డి, మైనర్‌ ఇరిగేషన్‌ ఈఈ వెంకటేశ్వరప్రసాద్‌, డీఈలు వెంకటరమణ, రత్నరాజు, గురుమూర్తి, జేఈలు వినయ్‌, మోహన్‌, కృష్ణారెడ్డి, డీసీసీ చైర్మన్‌ శజ్ఞారెడ్డి, టీడీపీ నాయకులు రమణారెడ్డి, గోపాల్‌, వీఆర్వో చంద్రనాయక్‌, రైతులు పాల్గొన్నారు.

Updated Date - Oct 26 , 2025 | 11:30 PM