Share News

రూ.100 కోట్లతో ఆలయాన్ని అభివృద్ధి చేయాలి

ABN , Publish Date - Aug 21 , 2025 | 12:51 AM

ఉరుకుంద ఈరన్న స్వామి ఆలయాన్ని రూ.100 కోట్లతో అభివృద్ధి చేయాలని సీఎం చంద్రబాబును రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేశ కోరారు.

రూ.100 కోట్లతో ఆలయాన్ని అభివృద్ధి చేయాలి
టీజీ వెంకటేశ దంపతులకు స్వాగతం పలుకుతున్న ఆలయ ఈవో, అర్చకులు

రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేశ

కర్నూలు కల్చరల్‌, ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి): ఉరుకుంద ఈరన్న స్వామి ఆలయాన్ని రూ.100 కోట్లతో అభివృద్ధి చేయాలని సీఎం చంద్రబాబును రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేశ కోరారు. ఈ క్షేత్రానికి రహదారులు, ఇతర మౌలిక వసతుల కల్పనకు మంత్రి టీజీ భరత ద్వారా ప్రతిపాదనలు సీఎం దృష్టికి తీసుకు పోయేలా కృషి చేస్తానని అన్నారు. బుధవారం రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేశ, టీజీ రాజ్యలక్ష్మి దంపతులు ఈరన్న స్వామి వారిని దర్శించుకున్నారు. టీజీ వెంకటేశ దంపతులకు ఆలయ కమిటీ ప్రతినిధుల ఆధ్వర్యంలో ఆలయ అధికారులు, అర్చకులు ఘన స్వాగతం పలికారు. టీజీ వెంకటేశ దంపతులు ఈరన్న స్వామికి పూజలు చేశారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ, ఆలయ కమిటీ ప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు.

Updated Date - Aug 21 , 2025 | 12:51 AM