Share News

రూ.100 కోట్ల బకాయిలు వసూలే లక్ష్యం

ABN , Publish Date - Jul 24 , 2025 | 12:15 AM

నగర పాలక సంస్థకు వివిధ రకాల పన్నుల రూపంలో వచ్చే రూ.100 కోట్ల బకాయి లను వసూలు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని కమిషనర్‌ పి.విశ్వ నాథ్‌ అన్నారు.

రూ.100 కోట్ల బకాయిలు వసూలే లక్ష్యం
రామలింగేశ్వర్‌నగర్‌లో పార్కును పరిశీలిస్తున్న కమిషనర్‌

నగరపాలక సంస్థ కమిషనర్‌ విశ్వనాథ్‌

కర్నూలు న్యూసిటీ, జూలై 23(ఆంధ్రజ్యోతి): నగర పాలక సంస్థకు వివిధ రకాల పన్నుల రూపంలో వచ్చే రూ.100 కోట్ల బకాయి లను వసూలు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని కమిషనర్‌ పి.విశ్వ నాథ్‌ అన్నారు. బుధవారం నగర పాలక కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరం అభివృద్ధి జరగాలంటే ప్రజలకు సకాలంలో అన్ని రకాల పన్నులు చెల్లించాల న్నారు. పారిశుధ్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తామన్నారు. ఆగస్టు 1 నుంచి ప్రత్యేక సెంటర్‌ పెట్టి వాటి ద్వారా నగరంలోని సి అండ్‌ డి వేస్టేజల సేకరించి జొహరాపురం డంపింగ్‌ యార్డు వద్ద ఉన్న సీఅండ్‌డీ వేస్టేజ్‌ మేనేజ్‌మెంట్‌ ప్లాంట్‌కు తరలి స్తామన్నారు. తద్వారా రీసైక్లింగ్‌ ప్రక్రియ చేపట్టి పునిర్వనియోగానికి చర్యలు తీసుకుంటామన్నారు. నగరంలో అర్హులందరూ ఇళ్ల కోసం దర ఖాస్తు చేసుకోవాలన్నారు. నగరంలో ట్రాఫిక్‌ నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నా మన్నారు. సమావేశంలో మేనేజర్‌ చిన్నరాముడు పాల్గొన్నారు.

పచ్చదనం పెంపునకు ప్రాధాన్యం: నగరంలో పచ్చదనం పెంచేందుకు అధిక ప్రాధాన్యమివ్వాలని నగర పాలక కమిషనర్‌ పి.విశ్వ నాథ్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం పెద్ద మార్కెట్‌, పాతబస్తీ, సి.క్యాంపు, బిర్లా కాంపౌండు ప్రాంతాల్లోని పలు పార్కులను ఆయన పరిశీలించారు. కమిషనర్‌ మాట్లాడుతూ ప్రస్తుత వర్షాకాలంలో నగర పరిధిలో దాదాపు ముప్పై వేల మొక్కలు నాటేందుకు చర్యలు తీసు కుంటున్నామన్నారు. అంతకుముందు పాతబస్టాండు అన్న క్యాంటీన, సీతారామ్‌నగర్‌లో పారిశుధ్య పనులను కమిషనర్‌ పరిశీలించారు. కొండారెడ్డి బురుజు వద్ద ఉన్న పార్కులో లైటింగ్‌, వాటర్‌ ఫౌంటేనలకు మరమ్మతులు చేపట్టి నైట్‌ వాచమన ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో హార్టికల్చర్‌ ఏడీ విజయలక్ష్మి, ప్రజారోగ్య అధికారి కె.విశ్వేశ్వరరెడ్డి, శానిటేషన సూపర్‌వైజర్‌ నాగరాజు, ట్రైనీ ఏఈ స్వాతి పాల్గొన్నారు.

Updated Date - Jul 24 , 2025 | 12:15 AM