విద్యార్థి దశ ఎంతో కీలకమైనది
ABN , Publish Date - Aug 01 , 2025 | 12:00 AM
జీవితంలో ఎదిగేందుకు విద్యార్థి దశ ఎంతో కీలకమైనది క్లస్టర్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ కట్టా వెంకటేశ్వర్లు అన్నారు.
క్లస్టర్ వర్సిటీ రిజిస్ట్రార్ కట్టా వెంకటేశ్వర్లు
కర్నూలు అర్బన్, జూలై 31 (ఆంధ్రజోతి): జీవితంలో ఎదిగేందుకు విద్యార్థి దశ ఎంతో కీలకమైనది క్లస్టర్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ కట్టా వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం సిల్వర్ జూబ్లీ కళాశాలలో రెండో రోజు సిల్వర్ సెట్ కౌన్సెలింగ్‌ను ఆయన ప్రిన్సి పాల్ శ్రీనివాస్ కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్ మాట్లాడుతూ సమయం ఎంతో విలువైందని, సమయాన్ని సద్విని యోగం చేసుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నారు. అనంతరం సిల్వర్ సెట్‌లో ర్యాంకులు సాధించిన విద్యార్థులకు సీటు అలాట్ మెంట్ పత్రాలను అందజేశారు. సెట్ కన్వీనరు వాయిజ్ మాట్లా డుతూ రెండో రోజు 300 మంది కౌన్సెలింగ్‌కు హాజరయ్యారని, మ్యా థ్స్‌లో 27, ఫిజిక్స్ 27, కంప్యూటర్ సైన్సు 44, కెమిస్ట్రీ 16 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించామన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ బీఆర్ ప్రసాదరెడ్డి, డీన్ నాగరాజ శెట్టి, అధ్యాపకులు ఓబులేసు, రాజశేఖర్, నరేంద్ర పాల్గొన్నారు.