Share News

బుగ్గనవి పిట్టకథలు

ABN , Publish Date - Jun 07 , 2025 | 11:40 PM

మాజీ మంత్రి బుగ్గన చెప్పే పిట్ట కథలు ప్రజలు నమ్మే పరిస్థితులు లేరని, ఆయన నీతులు చెబితే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంటాయని రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌ రెడ్డి అన్నారు.

బుగ్గనవి పిట్టకథలు
సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి బీసీ జనార్దన్‌ రెడ్డి

ఐదేళ్లు రాష్ట్రాన్ని నాశనం చేసిన వైసీపీ

లిక్కర్‌ స్కాంలో వేగంగా విచారణ

రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌ రెడ్డి

డోన్‌ టౌన్‌/డోన్‌ రూరల్‌, జూన్‌ 7 (ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి బుగ్గన చెప్పే పిట్ట కథలు ప్రజలు నమ్మే పరిస్థితులు లేరని, ఆయన నీతులు చెబితే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంటాయని రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌ రెడ్డి అన్నారు. శనివారం ఆర్‌అండ్‌బీ గెస్టు హౌస్‌లో ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, రాష్ట్ర సీడ్స్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ ధర్మవరం సుబ్బారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. మంత్రి బీసీ జనార్దన్‌ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచకపాలన సాగించిన వైసీపీ ఐదేళ్ల పాటు నాశనం చేశార న్నారు. ప్రజావేదిక కూల్చివేతతో పాలన ప్రారంభించిన జగన్‌, అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించారన్నారు. వైసీపీ హయాంలో ఆర్థిక మంత్రిగా ఉండి వేల కోట్లుఅప్పులు చేసి అప్పుల మంత్రిగా పేరు పొందాడని బుగ్గనను ఎద్దేవ చేశారు. కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత బుగ్గనకు లేదన్నారు. లిక్కర్‌ స్కాంలో విచారణ కొనసాగుతుందని బుగ్గనతో సహా ఎవరూ అక్ర మాలు పాల్పడినా శిక్ష అనుభవించాల్సిందే అన్నారు. బేతంచెర్ల మండలం లోని పాణ్యం సిమెంటు ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించడానికి ప్రయత్నం చేస్తామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పోలీసు శాఖలో ప్రభుత్వం విప్లవాత్మక సంస్కరణలు తీసుకువచ్చిందన్నారు. రాష్ట్రంలో పోలీ సులు నిష్పక్షపాతంగా పని చేస్తున్నారనీ కొనియాడారు. ఈ సమావేశంలో డీఐజీ కోయ ప్రవీణ్‌, ఎస్పీ అధిరాజ్‌ సింగ్‌ రాణా, ఆర్డీవో నరసింహులు, డోన్‌ డీఎస్పీ శ్రీనివాసులు, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ కోట్రికే హరికిషణ్‌, టీడీపీ నాయకులు వలసల రామకృష్ణ, పెద్ద కేశవయ్యగౌడు, ఓబులాపురం శేషిరెడ్డి, మర్రి రమణ, మాజీ ఎంపీపీ శేషఫణిగౌడు, సర్పంచ్‌ రేగటి అర్జున్‌ రెడ్డి, ఆర్‌అండ్‌బీ, పీఆర్‌ డీఈలు ప్రసాద్‌ రెడ్డి, గంగాధర్‌, ఏఈలు శ్రీహరి, ఏఈ నారాయణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 07 , 2025 | 11:40 PM