Share News

స్టీరింగ్‌ రాడ్‌ విరిగి బస్సు బోల్తా

ABN , Publish Date - Nov 30 , 2025 | 12:10 AM

స్టీరింగ్‌ రాడ్‌ విరిగి కర్ణాటక ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఇద్దరు ప్రయా ణికులకు స్వల్ప గాయాలు కాగా 27మంది సురక్షితంగా బయట పడ్డారు.

స్టీరింగ్‌ రాడ్‌ విరిగి బస్సు బోల్తా
బస్సు డ్రైవర్‌ను విచారిస్తున్న పత్తికొండ రూరల్‌ సీఐ పులిశేఖర్‌


కర్ణాటక ఆర్టీసీ బస్సుకు తప్పిన పెను ప్రమాదం

ఇద్దరు ప్రయాణికులకు స్వల్ప గాయాలు

27 మంది సురక్షితం

తుగ్గలి, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): స్టీరింగ్‌ రాడ్‌ విరిగి కర్ణాటక ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఇద్దరు ప్రయా ణికులకు స్వల్ప గాయాలు కాగా 27మంది సురక్షితంగా బయట పడ్డారు. పెను ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. వివరాలు.. మండలంలోని తుగ్గలి, రాతన గ్రామాల మధ్య బెంగుళూరు నుంచి మంత్రాలయం వెళ్తున్న కర్ణాటక ఆర్టీసీ బస్సు స్టీరింగ్‌ రాడ్‌ శనివారం తెల్లవారుజామున విరిగింది. బస్సు అదుపు తప్పి బోల్తాపడింది. ఆ సమయంలో బస్సులో 29 మంది ప్రయాణి కులు ఉన్నారు. కిరణ్‌, అనుశ్రీలకు స్వల్ప గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పత్తికొండ రూరల్‌ సీఐ పులిశేఖర్‌, తుగ్గలి ఎస్‌ఐ బాల నరసింహులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణా లను అడిగి తెలుసుకున్నారు. ప్రయాణికులకు వేరే బస్సులో సురక్షి తంగా వారి గమ్యస్థానాలకు పంపారు.

Updated Date - Nov 30 , 2025 | 12:10 AM