చంద్రబాబుతోనే రాష్ట్రం సస్యశ్యామలం
ABN , Publish Date - Jul 15 , 2025 | 12:35 AM
సీఎం చంద్రబాబుతోనే రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంటుందని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు.
పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి
కల్లూరు, జూలై 14(ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబుతోనే రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంటుందని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు. సోమవారం 36వ వార్డు పెద్దపాడులో టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్‌తో కలిసి ఆమె సుపరిపాలన తొలిఅడుగు కార్యక్రమంలో పాల్గొని, ఇంటింటికీ తిరిగి ప్రభుత్వ సంక్షేమ పథకా లను ప్రజలకు వివరించి, కరపత్రాలను అందజేశారు. గౌరు చరితారెడ్డి మాట్లాడుతూ సుపర్‌సిక్స్ హామీలను ఒక్కోక్కటిగా అమలు చేస్తూ కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు భరోసా ఇచ్చిందన్నారు. వైసీపీ విధ్వంస పాలనను తిరిగి గాడిలో పెట్టి రాష్ట్రంలో సీఎం చంద్రబాబు అభివృద్ధి, సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తున్నారన్నారు. కార్యక్రమంలో 36వ వార్డు టీడీపీ ఇనచార్జి రెడ్డిగారి తిరుమలేశ్వరరెడ్డి, ఏపీ స్టేట్ ఫైనాన్స కార్పొరేషన డైరెక్టర్ డి.రామాంజనేయులు, క్లస్టర్ ఇనచార్జి పీయూ మాదన్న, మాజీ సర్పంచు ఉమాదేవి, కో-క్లస్టర్ ఇనచార్జి లోకేశ్వరరెడ్డి, పెద్దబీచుపల్లి, చిన్న బీచుపల్లి, కురువ ధనుంజయుడు, జవ్వాజీ గంగా ధర్‌గౌడ్, శేఖర్‌చౌదరి, దేవేంద్రారెడ్డి, వినోద్ పాల్గొన్నారు.
.