Share News

చంద్రబాబుతో రాష్ట్రం సుభిక్షం

ABN , Publish Date - Aug 28 , 2025 | 11:39 PM

సీఎం చంద్రబాబుతోనే రాష్ట్రం సుభిక్షంగా ఉటుందని ‘కుడా’ చైర్మన్‌., టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు.

చంద్రబాబుతో రాష్ట్రం సుభిక్షం
‘కుడా’ చైర్మన్‌ సోమిశెట్టి వెంకటేశ్వర్లు

‘కుడా’ చైర్మన్‌ సోమిశెట్టి వెంకటేశ్వర్లు

కర్నూలు అర్బన్‌, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబుతోనే రాష్ట్రం సుభిక్షంగా ఉటుందని ‘కుడా’ చైర్మన్‌., టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో సూపర్‌ సిక్స్‌ పథకాలను అమలు చేస్తుందన్నారు. అభివృద్ధి, సంక్షేమాన్ని జీర్ణించుకోలేని వైసీపీ తప్పుడు ప్రచారాలు చేస్తూ, పోలీస్‌ అఽధికారులకు హెచ్చరికలు చేయడాన్ని ప్రజలు అన్ని గమనిస్తున్నాన్నారు. ఓ చానల్‌ను అడ్డుపెట్టుకుని రాజధాని అమరావతిని చంద్రబాబు ముంచే శాడని, ఫేక్‌ ప్రచారాలతో అభివృద్ధిని అడ్డుకునే కుట్రలు చేస్తున్నారని తెలిపారు. హంద్రీ నీవా పనులకు అతితక్కువ సమయంలో పూర్తి చేసి నీటిని మళ్లీంచి రైతులకు మేలు చేసిన ఘనత చంద్రబాబుకే దక్కు తుందన్నారు.

Updated Date - Aug 28 , 2025 | 11:39 PM