Share News

అమరవీరుల త్యాగం మరువలేనిది

ABN , Publish Date - May 11 , 2025 | 10:56 PM

దేశ రక్షణ కోసం ఆశువులు బాసిన మురళీనాయక్‌, సచిన్‌యాదవ్‌ త్యాగం మరువలేనిదని నాయకులు, పోలీసులు అన్నారు. ఆదివారం దేవనకొండ పంచాయతీ ఆవరణలో మృతిచెందిన సైనికుల చిత్రపటాలకు నివాళి ఆర్పించి, రెండు నిమిషాలు మౌనం పాటించారు.

అమరవీరుల త్యాగం మరువలేనిది
దేవనకొండలో నివాళి అర్పిస్తున్న నాయకులు, అధికారులు,పోలీసులు

దేవనకొండ, మే 11 (ఆంధ్రజ్యోతి): దేశ రక్షణ కోసం ఆశువులు బాసిన మురళీనాయక్‌, సచిన్‌యాదవ్‌ త్యాగం మరువలేనిదని నాయకులు, పోలీసులు అన్నారు. ఆదివారం దేవనకొండ పంచాయతీ ఆవరణలో మృతిచెందిన సైనికుల చిత్రపటాలకు నివాళి ఆర్పించి, రెండు నిమిషాలు మౌనం పాటించారు. సైనికుల ప్రాణత్యాగాలతో దేశం గర్విస్తోందని కోనియాడారు. కార్యక్రమంలో ఉచ్చీరప్ప, బోడ రవి, ,రామాంజినేయులు, ఏఎస్‌ఐ శ్రీనివాసులు పాల్గొన్నారు.

పత్తికొండ టౌన్‌, మే 11 (ఆంధ్రజ్యోతి): పాకిస్థాన్‌తో యుద్ధంలో అశువులు బాసిన వీర జవాన్‌ మురళీనాయక్‌కు యువ స్పందన సొసైటీ ఆధ్వ ర్యంలో నివాళి అర్పించారు. ఆదివారం పత్తికొండ యువ స్పందన స్టడీ సర్కిల్‌ కార్యాల యంలో కొవ్వొత్తులు వెలగించి జోహార్‌, అమర్‌ రహే అంటూ నినాదాలు చేశారు. సొసైటీ ఉపాద్యక్షుడు లక్ష్మన్న మాట్లాడుతూ దేశ రక్షణకు ప్రాణాలర్పించిన మురళీనాయక్‌ సేవలు మరువలేనివన్నారు. సెక్రటరీ నాగరాజు, రాజేశ్వరి, ఖాజా, జైవీర ఉన్నారు.

Updated Date - May 11 , 2025 | 10:56 PM