Share News

వీడని వాన

ABN , Publish Date - Oct 26 , 2025 | 12:23 AM

ఆళ్లగడ్డ, బనగానపల్లె, డోన నియోజ కవర్గాల్లో ఐదు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తు న్నాయి.

వీడని వాన
ఎగువ అహోబిలంలో ఉధృతంగా ప్రవహిస్తున్న భవనాశి

పొంగి ప్రహహిస్తున్న వాగులు

తడిచిన పంట దిగుబడులు

ఆళ్లగడ్డ/ రుద్రవరం/ దొర్నిపాడు/ సంజామల, డోన రూరల్‌, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): ఆళ్లగడ్డ, బనగానపల్లె, డోన నియోజ కవర్గాల్లో ఐదు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తు న్నాయి. శనివారం తెల్లవారుజామున కురిసిన వర్షంతో వాగులు, వంకలు పొంగి పొర్లాయి. రుద్రవరం మండలం వెలగల పల్లెలో వరి పంట నేలవాలింది. నరసాపురంలో రోడ్డుపై ఆరబోసిన మొక్కజొన్న తడిచిపోయాయి. దొర్నిపాడు ఎస్సీ కాలనీలో వర్షపు నీరు ఇళ్లల్లోకి చేరడంతో సామగ్రి తడిచి ముద్దయ్యాయి. అలాగే పంట పొలాల్లో వర్షపు నీరు చేరింది. సంజామలలో పాలేరు వాగు పొంగి ప్రవహిం చింది. దీంతో రాకపోకలు స్తంభించాయి. ఆళ్లగడ్డ మండలంలోని కోట కందుకూరు గ్రామ సమీపంలో వక్కిలేరు, ఎగువ అహోబిలంలో భవనాశి నది ఉధృతంగా ప్రవహిస్తుంది. ఆర్‌ కిష్ణాపురం, బాచేపల్లె, తదితర గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఏరుదాటే క్రమం లో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని మున్సిపల్‌ కమిషనర్‌ కిషోర్‌ సిబ్బందిని అప్రమత్తం చేసి నీటి ప్రవాహం తగ్గేంత వరకు ఈ రూట్‌లో వాహనాలు ప్రయాణించకుండా ప్రజలను అప్రమత్తం చేశారు. సంజామల మండలంలో పాలేరు, గోండ్ర, కప్పల వాగులు ఉధృతి తగ్గలేదు. డోన మండలంలో శనివారం ఉదయం, రాత్రి కురి సిన వర్షం నీరు రోడ్డు మీద ప్రవహించడంతో దాదాపు 2 గంటల సేపు ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.

Updated Date - Oct 26 , 2025 | 12:23 AM