Share News

కోసిగిలో దంచి కొట్టిన వాన

ABN , Publish Date - Oct 28 , 2025 | 12:02 AM

మొంథా తుఫాన్‌ కారణంగా సోమవారం మధ్యాహ్నం నుంచే కోసిగిలో వర్షం దంచి కొట్టింది. దీంతో వాగులు, వంకలు పొం గిపొర్లాయి.

కోసిగిలో దంచి కొట్టిన వాన
ఉరుకుంద రోడ్డులో చాప వంకపై ప్రవహిస్తున్న నీరు

ఉధృతంగా ప్రవహించిన చాప వంక

4 గంటల పాటు రాకపోకలకు అంతరాయం

ఇబ్బందులు పడిన ప్రయాణికులు, ఉరుకుంద భక్తులు

కోసిగి, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): మొంథా తుఫాన్‌ కారణంగా సోమవారం మధ్యాహ్నం నుంచే కోసిగిలో వర్షం దంచి కొట్టింది. దీంతో వాగులు, వంకలు పొం గిపొర్లాయి. ముఖ్యంగా కోసిగిలోని ఉరుకుంద రోడ్డులో ఉన్న చాపవంకకు వరద నీరు పోటెత్తడంతో సుమారు 4 గంటల పాటు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఒక రి ఒకరు చేతులు పట్టుకుని ప్రజలు చాపవంక దాటారు. స్థానికంగా కొందరు యువకులు టీడీపీ క్లస్టర్‌-4 ఇన్‌చార్జి, మండల టీడీపీ యువ నాయకుడు జ్ఞానేష్‌ తమ యువకులతో కలిసి చాపవంక వద్ద ప్రయాణికులను వాగును దాటించారు. అనంతరం ప్రజలకు హెచ్చరికలు జారీ చేసి సహాయ సహకారాలు అందజేశారు. ఎస్‌ఐ హనుమంతరెడ్డి చాపవంక వద్ద ప్ర యాణికులను, విద్యార్థులను అప్రమత్తం చేస్తూ వంకను దాటిం చారు. యువకుల సాయంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్ర యాణికులను వాగు దాటించారు. సుమారు గంటల పాటు ట్రాఫి క్‌ జామ్‌ కావడంతో వాహనాలు బారులు తీరాయి. మొదటి కార్తీక సోమవారం సందర్భంగా రాష్ట్రంతోపాటు తెలంగాణ, కర్ణాటక నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఉరుకుందకు తరలిరావడంతో సు మారు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. 5 గంటల సమయంలో వరద ఉధృతి తగ్గిన తర్వాత ముందుకు సాగాయి.

Updated Date - Oct 28 , 2025 | 12:02 AM