Share News

సమాజాభివృద్ధిలో టీచర్ల పారత్ర కీలకం

ABN , Publish Date - Sep 06 , 2025 | 12:18 AM

విద్యార్థుల సమాజాభివృద్ధిలో ఉపాధ్యాయులదే కీలక పాత్ర పోషిస్తున్నారని కలెక్టర్‌ రంజిత్‌ బాషా అన్నారు.

సమాజాభివృద్ధిలో టీచర్ల పారత్ర కీలకం
ఉపాధ్యాయుడికి అవార్డు అందజేసి సత్కరిస్తున్న ఎంపీ, ఎమ్మెల్యే,కలెక్టర్‌

రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి కృషి

కలెక్టర్‌ రంజిత్‌ బాషా

ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం

ఉత్తమ ఉపాధ్యాయులు, అధ్యాపకులకు అవార్డులు

కర్నూలు ఎడ్యుకేషన్‌, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): విద్యార్థుల సమాజాభివృద్ధిలో ఉపాధ్యాయులదే కీలక పాత్ర పోషిస్తున్నారని కలెక్టర్‌ రంజిత్‌ బాషా అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జరిగిన గురు పూజోత్సవంలో కలెక్టర్‌తో పాటు ఎంపీ బస్తిపాటి నాగరాజు, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఉత్తమ ఉపాధ్యాయులు, అధ్యాపకులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ తల్లిదండ్రుల తర్వాత గురువులను పూజించే సంప్రదాయం అనాదిగా వస్తుందని, ఈ సంప్రదాయం తరతరాలకు వర్ధిల్లాలని కలెక్టర్‌ అభిప్రాయ పడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. బడిఈడి పిల్లలందరికీ బడుల్లోనే చేర్పించాలనే అంశంలో కర్నూలు జిల్లా రాష్ట్రంలోనే ముందుందన్నారు. గత సంవత్సరం 5.15లక్షల మంది విద్యార్థులు బడిలో ఉండగా ఈఏడాది 5.22లక్షల మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న పాఠ్య పుస్తకాలు, యూనిఫాం, మధ్యాహ్న భోజనం, ఆన్‌లైన్‌ తరగతులు సద్వినియోగించుకోవాలని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో నాసరరెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్‌పాల్‌, ఇన్‌చార్జి ఆర్‌ఐవో జి.లాలెప్ప, కార్పొరేటర్‌ పద్మలతారెడ్డి, రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ వెల్ఫేర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ పార్వతి, రాష్ట్ర బొందిలి వెల్పేర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ విక్రమ్‌సింగ్‌, అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైనది

సమాజంలో ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైనదని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు. ఉపాధ్యాయులు ఆదర్శప్రాయులు, మార్గదర్శకులు అని కొనియాడారు. మట్టిలోని మాణిక్యాలను వెలికితీసేది ఉపాధ్యాయులే అని ఎమ్మెల్యే ప్రశంసించారు.

ఉపాధ్యాయులది ఎనలేని కృషి

విద్యార్థులను తీర్చిదిద్దడంతో ఉపాధ్యాయులు ఎనలేని కృషి చేస్తున్నారని డీసీఎంఎస్‌ చైర్మన్‌ వై.నాగేశ్వరరావు యాదవ్‌ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు.

Updated Date - Sep 06 , 2025 | 12:18 AM