Share News

బంగారు కుటుంబాల అర్హతలను పునఃపరిశీలించాలి: కమిషనర్‌

ABN , Publish Date - Jul 25 , 2025 | 12:50 AM

పబ్లిక్‌ ప్రైవేట్‌ పీపుల్‌ పార్టనర్షిప్‌ (పీ4) పథకం కింద బంగారు కుటుంబాల అర్హతలను పునః పరిశీలించాలని నగర పాలక కమిషనర్‌ పి.విశ్వనాథ్‌ అధికారు లను ఆదేశించారు.

బంగారు కుటుంబాల అర్హతలను పునఃపరిశీలించాలి: కమిషనర్‌
మాట్లాడుతున్న కమిషనర్‌ విశ్వనాథ్‌

కర్నూలు న్యూసిటీ, జూలై 24(ఆంధ్రజ్యోతి): పబ్లిక్‌ ప్రైవేట్‌ పీపుల్‌ పార్టనర్షిప్‌ (పీ4) పథకం కింద బంగారు కుటుంబాల అర్హతలను పునః పరిశీలించాలని నగర పాలక కమిషనర్‌ పి.విశ్వనాథ్‌ అధికారు లను ఆదేశించారు. గురువారం స్థానిక ఎస్బీఐ కాలనీలోని నగర పాలక సమావేశ భవనంలో పీ4 పథకంపై అడ్మిన కార్యదర్శులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కమిషనర్‌ మాట్లాడుతూ నగరంలో పీ4 పథకం కింద 10,600 బంగారు కుటుంబాలను గుర్తించామని, ఈ నెలాఖరులోగా వారి అర్హతలను మారోమారు పక్కాగా పరిశీలించాలని సూచించారు. 629 మంది మార్గ దర్శకులను ఇప్పటికే ఎంపిక చేశామని, వారికి 3,709 మంది బంగారు కుటుంబాలను దత్తత తీసుకునేందుకు అనుసంధానం చేశామన్నారు. మిగిలిన బంగారు కుటుంబాలను ఆగస్టు 15లోపు దత్తత తీసుకునేలా మార్గదర్శకులను అన్వేషించాలని అన్నారు. కార్యక్రమంలో అడిషనల్‌ కమి షనర్‌ ఆర్‌జీవీ కృష్ణ, సూపరింటెండెంట్‌ మంజూర్‌బాషా, స్పెషల్‌ ఆఫీసర్‌ సొహైల్‌, కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - Jul 25 , 2025 | 12:50 AM