Share News

గులాబీ పురుగు నమిలేస్తోంది..

ABN , Publish Date - Nov 02 , 2025 | 11:38 PM

ఖరీఫ్‌లో సాగుచేసిన పత్తి పంటను గులాబీ పురుగు నాశనం చేస్తోంది. ఏ మందు పిచికారీ చేసినా ఫలితం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గులాబీ పురుగు నమిలేస్తోంది..
కాయలోపురుగు మందు పిచికారీ చేస్తున్న రైతు గులాబీ పురుగు

పత్తి కాయలను తినేస్తున్న పురుగు

గుండెలు బాదుకుంటున్న రైతులు

ఓర్వకల్లు, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): ఖరీఫ్‌లో సాగుచేసిన పత్తి పంటను గులాబీ పురుగు నాశనం చేస్తోంది. ఏ మందు పిచికారీ చేసినా ఫలితం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని ఓర్వకల్లు, కన్నమడకల, పూడిచెర్ల, నన్నూరు, లొద్దిపల్లె, ఉయ్యాలవాడ, ఉప్పలపాడు, గుట్టపాడు, హుశేనాపురం, తదితర గ్రామాల్లో 4,500 హెక్టార్లలో పత్తి సాగు చేశారు.

తగ్గిన దిగుబడి..

పత్తి సాగుకు ఎకరాకు రూ.40వేల వరకు పెట్టుబడి అవుతుంది. గతేడాది ఎకరాకు 15 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చిందని, ఈ ఏడాది పెరుగు దెబ్బకు 5 క్వింటాళ్లు కూడా వచ్చేలా లేదని రైతులు దిగులు చెందుతు న్నారు. ఎన్ని మందులు వాడినా పురుగు అదుపులోకి రాకపోవడంతో పంటను పొలంలోనే వదిలేస్తున్నారు. దీనికి తోడు మొంథా తుఫాన్‌ ప్రభావంతో పంట నష్టపో యినట్లు రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం తమకు నష్ట పరిహారం ఇవ్వాలని కోరుతున్నారు.

కాయ దశలో పురుగు ఉధృతి

పంట ఏపుగా పెరగడంతో రైతులు ఈ ఏడాది పంట బాగా వస్తుందని ఆశించారు. అయితే గులాబీ పురుగు సోకడంతో పంట పూర్తిగా నాశననమవుతోంది. పురుగు రసం పీల్చడంతో పూత వాడిపోయి నేలపాలవు తోంది. అలాగే పత్తి కాయల్లో పురుగు ఉండటంతో వాడిపోయి నల్లగా మారాయి.

లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేసుకోవాలి

గులాబీ పురుగు నివారణకు పొలంలో ఎకరాకు 5 నుంచి 10 లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేసుకోవాలి. అలాగే సస్యరక్షణతో పత్తి పంటను కాపాడుకోవాలి. గులాబీ పురుగు రాకుండా వేపనూనె ఆక్ల్సిఫైడ్‌ పిచికారీ చేయాలి. - మధుమతి, ఏవో, ఓర్వకల్లు

Updated Date - Nov 02 , 2025 | 11:38 PM