వైసీపీకి ప్రజలే బుద్ధి చెప్పారు
ABN , Publish Date - Aug 15 , 2025 | 12:48 AM
పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని గెలిపించి వైసీపీకి ప్రజలే బుద్ధి చెప్పారని కేడీసీసీబీ చైర్మన విష్ణువర్ధనరెడ్డి అన్నారు.
కేడీసీసీబీ చైర్మన విష్ణువర్ధనరెడ్డి
జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ విజయంపై సంబరాలు
కర్నూలు రూరల్, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని గెలిపించి వైసీపీకి ప్రజలే బుద్ధి చెప్పారని కేడీసీసీబీ చైర్మన విష్ణువర్ధనరెడ్డి అన్నారు. గురువారం నగరంలోని ఆయన నివాసంలో కోడుమూరు ఎమ్మెల్యే దస్తగిరితోపాటు మండలాల నాయకులు, కార్యకర్తలు, రైతులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.
ఓర్వకల్లు: మాజీ సీఎం వైఎస్ జగన్మోహన రెడ్డి కంచుకోటకు బీటలు వారాయి. పులివెందుల, ఒంటిమెట్ట జడ్పీటీసీ ఉప ఎన్ని కల్లో టీడీపీ ఘన విజయం సాధించిందని టీడీపీ మండల కన్వీ నర్ గోవిందరెడ్డి, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు మోహనరెడ్డి అన్నారు. గురువారం ఓర్వకల్లులో టీడీపీ విజయంపై కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. బీసీ సెల్ అధ్యక్షుడు అల్లాబాబు, నాయకులు స్వామిరెడ్డి, కోటేశ్వరరావు, అబ్దుల్లా, కురువ నాగరాజు, ఆదామ్, శ్రీరాములు, చంద్రయ్య పాల్గొన్నారు.
గూడూరు: పులివెందులలో జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో జగన కోట ను టీడీపీ బద్దలు కొట్టి గెలిచిందని పార్టీ మండల అధ్యక్షుడు జె సురేష్ అన్నారు. గురువారం మండలంలోని కె.నాగలాపురంలో పులివెందుల, ఒట్టిమిట్ట జడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ విజయంపై పార్టీ శ్రేణులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. టీడీపీ నాయకులు గోపాల్ రెడ్డి, కేడీసీసీ డైరక్టర్ అల్లిపీరా, తిరుపాలు, నాగులు, సుంకన్న పాల్గొన్నారు.