పార్టీకి కార్యకర్తలే బలం
ABN , Publish Date - May 18 , 2025 | 11:39 PM
టీడీపీకి కార్యకర్తలే బలమని నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్షులు మల్లెల రాజశేఖర్ అన్నారు.
టీడీపీ జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్
యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తాం
టీడీపీ నంద్యాల లోక్‌సభ నియోజకవర్గ ఇన్‌చార్జి మాండ్ర శివానందరెడ్డి
కార్యకర్తల కృషితోనే ఎమ్మెల్యే అయ్యాను
గిత్తా జయసూర్య
నందికొట్కూరు, మే 18 (ఆంధ్రజ్యోతి): టీడీపీకి కార్యకర్తలే బలమని నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్షులు మల్లెల రాజశేఖర్ అన్నారు. ఆదివారం నందికొట్కూరు పట్టణంలోని ఎన్.ఎస్.ఫంక్షన్ హాలులో నియోజకవర్గ మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్‌చార్జి మాండ్ర శివానందరెడ్డి, ఎమ్మెల్యే గిత్తాజయసూర్య, నియోజకవర్గ పరిశీలకులు దేవళ్ల మురళి, యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ కడియం వెంకటేశ్వర్లు యాదవ్, ఆయా మండలాల కన్వీనర్లు, టీడీపీ నాయకులు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారకరామారావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని పలు సమస్యలపై చర్చించి పలు అభివృద్ధి కార్యక్రమా లు చేపట్టాలని తీర్మానించారు. వాటిని సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్క రించేందుకు కృషిచేస్తామని జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు తెలిపారు. ఈ సందర్భంగా మల్లెల రాజశేఖర్ మాట్లాడుతూ సామాన్య కార్యకర్తలకు పట్టం కట్టే పార్టీ టీడీపీ అని ఆయన అన్నారు. నందికొట్కూరు నియోజ కవర్గం వ్యవసాయాధారిత మైనదని, రైతులకు సాగునీరు అందించేందుకు పెద్దపీట వేయాలన్నారు. ఆతర్వాత యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిం చాలని ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు మాండ్ర తెలిపారు. మిడ్తూరు మండలంలో ఎత్తిపోతల పథకం ఏర్పాటుచేసి ఆ మండలానికి సాగునీరు అందిస్తామని, తంగడంచ వద్ద జైన్ ఇరిగేషన్, తదితర సంస్థలను తీసుకొచ్చి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే రాయలసీమ సస్యశ్యామలం అవుతుందన్నారు. కష్టకాలాలో పార్టీకి అండగా నిలబడిన వారికే పదవులు దక్కుతాయన్నారు. ఈ కార్యక్రమంలో 2వ వార్డు కౌన్సిలర్ జాకీర్ హుస్సేన్, టీడీపీ నాయకులు మాండ్ర సురేంద్రనాథ్‌రెడ్డి, ముర్తుజావళి, షకీల్ అహ్మద్, లాయర్ జాకీర్, హరినాథ్‌రెడ్డి, వేణుగోపాల్, వనజ, తదితరులు పాల్గొన్నారు.
సామాన్య కార్యకర్తను ఎమ్మెల్యే చేసిన ఘనత..
నియోజకవర్గంలోని టీడీపీ కార్యకర్తల కృషితోనే ఎమ్మెల్యేను అయ్యానని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య అన్నారు. అతి సామాన్య కార్యకర్తను అయిన తనను ఎమ్మెల్యేగా చేసిన ఘనత టీడీపీకి, మాండ్ర శివానందరెడ్డికే దక్కుతుందన్నారు. చంద్రబాబు నాయుడు, మాండ్ర శివానందరెడ్డి, కార్యకర్తల కృషితోనే తాను ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాన న్నా రు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 10 నెలల్లో నియోజకవర్గ వ్యాప్తంగా దాదాపు రూ.10కోట్ల నిధులతో సీసీ రోడ్లు వేయిస్తున్నా మన్నారు. అగ్నిమాపక కేంద్రం ఏర్పాటుకు భూమి పూజ చేశామన్నారు. అలగనూరు రిజర్వాయర్ మరమ్మతుకు ప్రభుత్వం నుంచి నిధులు మంజూరయ్యాయని, టెండర్ దశలో ఉందన్నారు. తంగడెంచ వద్ద పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తున్నామన్నారు.