నష్టాల ఉల్లి..!
ABN , Publish Date - Sep 16 , 2025 | 11:52 PM
ఉల్లి పంటను సాగు చేసిన రైతులు నష్టాల బాట పట్టారు. మూడు నెలల పాటు ఉల్లి పంటను పండిస్తే ధర లేక రైతన్నలు కుప్పకూలిపోయే పరిస్థితి నెలకొంది.
ఉల్లి పంటను సాగు చేసిన రైతులు నష్టాల బాట పట్టారు. మూడు నెలల పాటు ఉల్లి పంటను పండిస్తే ధర లేక రైతన్నలు కుప్పకూలిపోయే పరిస్థితి నెలకొంది. నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం చిన్నవంగలి గ్రామంలో శ్రీరామ్‌రెడ్డి అనే రైతు రెండెక రాల్లో ఉల్లి పంట సాగుచేశాడు. రూ.లక్ష దాకా పెట్టి పెట్టాడు. గిట్టుబాటు ధర లేక, కూలీల ఖర్చులు కూడా రాకపోవడంతో మంగళవారం పొలంలోనే ఉల్లిగడ్డలను వదిలేశారు. కేజీ ధర రూ.5 పలకడంతో ఉల్లిగడ్డలు కోసిన కూలి రూ.15వేలు అవుతుండటంతో పంటను వదిలేశానని రైతు ఆవేదన వెలిబుచ్చాడు.
చాగలమర్రి, ఆంధ్రజ్యోతి