జీడీపీకి కొనసాగుతున్న వరద
ABN , Publish Date - Oct 26 , 2025 | 11:34 PM
జీడీపీలో వరద కొనసాగుతోంది. ఆదివారం 4వ గేటు నుంచి 1,630 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు జీడీపీ ఏఈ మహుమ్మద్ ఆలీ తెలిపారు.
4వ గేటు నుంచి 1,630 క్యూసెక్కుల నీరు విడుదల
గోనెగండ్ల, అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి): జీడీపీలో వరద కొనసాగుతోంది. ఆదివారం 4వ గేటు నుంచి 1,630 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు జీడీపీ ఏఈ మహుమ్మద్ ఆలీ తెలిపారు. శనివారం 4, 5, గేట్ల ద్వారా నీటి విడుదల చేసిన అధికారులు రాత్రి ఐదో గేటు మూసివేశారు. 4వ గేటు ద్వారా మాత్రమే నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టులో పస్తుతం 4టీఎంసీల వరద చేరింది. ప్రాజెక్టు నీటి నిలువ సామర్థ్యం 4.5 టీఎంసీలు. నీటి మట్టాన్ని బట్టి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు దిగువకు నీటిని వదులుతున్నట్లు ఏఈ తెలిపారు. మద్దికెర, దేవకొండ, పత్తికొండ, ఆస్పరి, తుగ్గలి ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండటంతో జీడీపీకి వరద వస్తోంది. మొంథా తుఫాన్‌ను దృష్టిలో పెట్టుకొని అధికారులు నీటి విడుదల చేపట్టారు.