Share News

దేశ ఐక్యతకు చిహ్నం జాతీయ జెండా

ABN , Publish Date - Aug 12 , 2025 | 12:35 AM

దేశ ఐక్యతకు చిహ్నం జాతీయ జెండా అని, ప్రతి ఇంటా మువ్వన్నెల జెండా ఎగరాలని కలెక్టర్‌ రంజిత బాషా పిలుపునిచ్చారు.

దేశ ఐక్యతకు చిహ్నం జాతీయ జెండా
కలెక్టర్‌ను సన్మానిస్తున్న ఎమ్మెల్సీ బీటీ నాయుడు, అధికారులు

కలెక్టర్‌ రంజిత బాషా

కర్నూలు కలెక్టరేట్‌, ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి): దేశ ఐక్యతకు చిహ్నం జాతీయ జెండా అని, ప్రతి ఇంటా మువ్వన్నెల జెండా ఎగరాలని కలెక్టర్‌ రంజిత బాషా పిలుపునిచ్చారు. సోమవారం కలెక్టరేట్‌ సునయన ఆడిటో రియంలో నిర్వహించిన హర్‌ ఘర్‌ తిరంగా మహోత్సవం కార్యక్రమంలో కలెక్టర్‌, ఎమ్మెల్సీ బీటీ నాయుడు పాల్గొన్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ఆజాదీ కా అమృత మహోత్సవంలో భాగంగా 75వ స్వాతంత్ర దినోత్సవం నుంచి ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు 2వ తేదీ నుంచి 15వ తేదీ వరకు హర్‌ ఘర్‌ తిరంగా మహోత్సవం కార్యక్రమాలను నిర్వహించుకుంటు న్నామన్నా రు. ఎమ్మెల్సీ బీటీ నాయుడు మాట్లాడుతూ బ్రిటీష్‌ వారిని భార తదేశం నుంచి తరిమికొట్టడానికి లక్షలాది మంది స్వాతంత్ర ఉద్యమంలో పాల్పంచుకున్నా రని అన్నారు. కార్యక్రమంలో డీఆర్వో వెంకటనారాయణమ్మ, మున్సిపల్‌ కమిషనర్‌ విశ్వనాథ్‌ పాల్గొన్నారు.

ఫ సంపూర్ణతా అభియాన కింద కర్నూలు జిల్లాకు బంగారు పతకాన్ని నీతి అయోగ్‌ ప్రకటించిందని కలెక్టర్‌ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్‌ లోని సునయన ఆడిటోరియంలో సంపూర్ణతా అభియాన సమ్మాన సమా రోహ్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. సంపూర్ణతా అభియాన పథకంలో భాగంగా మద్దికెర, చిప్పగిరి, హోళగుంద మండలాల్లో నిర్దేశించిన 6 సూచి కల్లో వంద శాతం ప్రగతి సాధించిన నేపథ్యంలో నీతి అయోగ్‌ కర్నూలు జిల్లాకు బంగారు పతకం ప్రకటించింది. ఇందుకు కృషి చేసిన కలెక్టర్‌, అధి కారులను ఎమ్మెల్సీ బీటీ నాయుడు సన్మానించారు.

ఫ కలెక్టరేట్‌ కార్యాలయంలో సోమవారం హర్‌ఘర్‌ తిరంగ సెల్ఫీ పాయింట్‌ను కలెక్టర్‌ రంజిత బాషా ప్రారంభించి జాతీయ జెండాను చేత బూని సెల్ఫీ దిగారు. కలెక్టర్‌ మాట్లాడుతూ కలెక్టరేట్‌లో ఉన్న ఉద్యోగు లంతా సెల్ఫీ పాయింట్‌లో ఫొటో తీసుకుని హర్‌ ఘర్‌ తిరంగా.కామ్‌ వెబ్‌ సైట్‌లో అప్‌లోడు చేయా లని కోరారు. జాయింట్‌ కలెక్టర్‌ బి.నవ్య వెంకట నారాయణమ్మ, సెట్కూరు సీఈవో వేణుగోపాల్‌, జిల్లా టూరిజం అధికారి లక్ష్మీనారాయణ పాల్గొని సెల్ఫీ తీసుకున్నారు.

ఫ ప్రతిఒక్కరూ మట్టి వినాయకుడిని పూజించి పర్యావరణాన్ని రక్షించడంలో భాగస్వాములు కావాలని కలెక్టర్‌ రంజిత బాషా తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌ సున యన ఆడిటోరియంలో మట్టి వినాయకున్ని పూ జిద్దాం.. పర్యావరణాన్ని రక్షిద్దాం అనే పోస్టర్‌ను కలెక్టర్‌ ఆవిష్కరించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ వినాయక చవితి పండుగను పర్యావరణానికి హానీ కలిగించకుండా జరుపుకోవాలని, రసాయనాలతో చేసిన విగ్రహాలకు బదు లుగా మట్టి విగ్ర హాలను పూజించాలని కలెక్టర్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Updated Date - Aug 12 , 2025 | 12:35 AM