పత్తి గరిష్ఠ ధర క్వింటం రూ.7,881
ABN , Publish Date - May 16 , 2025 | 12:33 AM
ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో గురువారం పత్తి ధర క్వింటం గరిష్ఠంగా రూ.7881 కు వ్యాపారులు కొనుగోలు చేశారు.
ఆదోని అగ్రికల్చర్, మే 15(ఆంధ్రజ్యోతి): ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో గురువారం పత్తి ధర క్వింటం గరిష్ఠంగా రూ.7881 కు వ్యాపారులు కొనుగోలు చేశారు. గతవారంతో పోల్చితే క్వింటానికి రూ.200 పైగా ధర తగ్గింది. సీజన్ ముగియడంతో పత్తి దిగుబడిలో నాణ్యత లేకపోవడంతోనే ధరలు తగ్గడానికి కారణమని వ్యాపారులు చెబుతున్నారు. 2725 క్విటాళ్ల పత్తి విక్రయానికి రాగా కనిష్ఠ ధర రూ. 4189, మధ్యస్థ ధర రూ.7,529 పలికింది.