Share News

లాంచీ ప్రయాణం.. ఆహ్లాదకరం

ABN , Publish Date - Nov 08 , 2025 | 11:27 PM

శ్రీశైల మల్లన్నను దర్శించు కునేందుకు కృష్ణానదిపై లాంచీ ప్రయాణం ఎంతో ఆహ్లాదకరంగా ఉందని యాత్రికులు హర్షం వ్యక్తంచేశారు.

లాంచీ ప్రయాణం.. ఆహ్లాదకరం
శ్రీశైలం చేరుకున్న డబుల్‌ డెక్కర్‌ లాంచి

66 మందితో వచ్చిన టీఎస్‌ టూరిజం లాంచీ

సోమశిల నుంచి శ్రీశైలానికి 120 కిలోమీటర్ల

శ్రీశైలం, నవంబరు 8(ఆంధ్రజ్యోతి) : శ్రీశైల మల్లన్నను దర్శించు కునేందుకు కృష్ణానదిపై లాంచీ ప్రయాణం ఎంతో ఆహ్లాదకరంగా ఉందని యాత్రికులు హర్షం వ్యక్తంచేశారు. శనివారం ఉదయం 11గంటలకు సోమశిల నుంచి శ్రీశైలం బయలుదేరిన తెలంగాణ టూ రిజం డబుల్‌ డెక్కర్‌ లాంచి సాయంత్రం 6గంటలకు పాతాళగంగ వద్దకు సురక్షితంగా చేరుకుంది. కృష్ణానదిపై ఏడాది తరువాత పర్యాటకులకు అందుబాటులోకి వచ్చిన లాంచీ ప్రయాణం ప్రకృతి అందాలు, పచ్చదనం, వివిధ రకాల పక్షుల శబ్దాలు, చెంచు గూడెంలను చూస్తూ శ్రీశైలానికి చేరుకున్నట్లు ప్రయాణికులు తెలిపారు. 120 మంది సామర్థ్యం గల లాంచీలో 66 మందితో వచ్చారు. ఆదివారం ఉదయం సోమశిలకు తిరుగు ప్రయాణం అవుతామని టూరిజం అధికారులు తెలిపారు. సోమశిల నుంచి శ్రీశైలం వరకు జలమార్గం సుమారు 120 కిలోమీటర్లు ఉంటుంది.

Updated Date - Nov 08 , 2025 | 11:27 PM