Share News

అధికారులదే కీలకపాత్ర

ABN , Publish Date - Dec 01 , 2025 | 11:19 PM

ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులదే కీలక పాత్ర అని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ పేర్కొన్నారు.

అధికారులదే కీలకపాత్ర
పింఛన్లు పంపిణీ చేస్తున్న మంత్రి, కలెక్టర్‌

న్యాయ, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌

నంద్యాల రూరల్‌, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులదే కీలక పాత్ర అని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ పేర్కొన్నారు. సోమవారం కలెక్టర్‌ రాజకుమారి, మార్కెట్‌ యార్డు చైర్మెన్‌ గుంటుపల్లి హరిబాబుతో కలిసి గ్రామంలో నూతనంగా నిర్మించిన సచివాలయ భవనాన్ని, సీసీ రోడ్లను ఆయన ప్రారంబించారు. అనంతరం వృద్ధాప్య పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సచివాలయాల ద్వారా ప్రజలకు సేవలు మరింత చేరువవుతున్నాయని అన్నారు. గ్రామంలో వోహెచ్‌ యస్‌ఆర్‌ ఏర్పాటు చేసి ప్రతి ఇంటికి తాగు నీరు సరఫరా చేయనున్నట్లు తెలిపారు. డ్రైనేజీ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. గత ప్రతిపాదనల మేరకు కొత్తపల్లి, భీమవరం, పులిమద్ది, పోలూరు గ్రామాల మీదుగా రింగ్‌ రోడ్డు ఏర్పాటుకు ప్రభుత్వానికి నివేదికలు పంపనున్నట్లు పేర్కొన్నారు. సమస్యల పరిష్కారంలో అధికారులు, ప్రజాప్రతినిధుల తమ బాధ్యత మరవరా దన్నారు. నిష్పక్షపాతంగా పని చేయాలని సూచించారు. అనంతరం కలెక్టర్‌ రాజకుమారి పింఛన్లు సకాలంలో అందు తున్నాయా, పంపిణీ సమయంలో ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా? అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఓ మాన సిక వికలాంగుడికి పింఛన్‌ రావడం లేదని కలెక్టర్‌ దృష్టికి తేగా, వెంటనే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్‌ విశ్వనాథరెడ్డి, జడ్పీటీసీ గోకుల కృష్ణారెడ్డి, ఆర్డీవో చల్లా విశ్వనాఽథ్‌, ఎమ్మార్వో శ్రీవాణి, ఎంపీడీవో సుగుణశ్రీ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 01 , 2025 | 11:19 PM