‘అల్లూరి’ స్ఫూర్తి భావి తరాలకు ఆదర్శం
ABN , Publish Date - Jul 04 , 2025 | 11:44 PM
అల్లూరి సీతారామరాజు తెగువ, ధైర్యం, స్ఫూర్తి భావితరాలకు ఆదర్శమని కలెక్టర్ రాజకుమారి అన్నారు.
కలెక్టర్ రాజకుమారి
నంద్యాల టౌన్ జూలై 4(ఆంధ్రజ్యోతి): అల్లూరి సీతారామరాజు తెగువ, ధైర్యం, స్ఫూర్తి భావితరాలకు ఆదర్శమని కలెక్టర్ రాజకుమారి అన్నారు. శుక్రవారం అల్లూరి జయంతిని పురస్కరించుకొని కలెక్టరేట్‌లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వాతంత్య్రం కోసం తన ప్రాణాలను తృణపాయంగా త్యాగంచేసిన గొప్ప వ్యక్తి అన్నారు. నిరక్షరాస్యులకు, పేదలకు, అమాయకులకు అండగా అల్లూరి నిలిచారన్నారు. కార్యక్రమంలో జేసీ విష్ణు చరణ్ , డీఆర్వో రామునాయక్, సీతారామరాజు పుస్తక రచయిత సురేశ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.