Share News

జిల్లాలోనే ఆదర్శం

ABN , Publish Date - Nov 27 , 2025 | 11:51 PM

చాగలమర్రి మండలం మద్దూరు పాఠశాల జిల్లాలోనే ఆదర్శంగా నిలిచిందని డీఈవో జనార్దన్‌రెడ్డి తెలిపారు.

జిల్లాలోనే ఆదర్శం
మధ్యాహ్న భోజనాన్ని పరిశీలిస్తున్న డీఈవో జనార్దన్‌రెడ్డి

మద్దూరు పాఠశాలను తనిఖీ చేసిన డీఈవో

చాగలమర్రి, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): చాగలమర్రి మండలం మద్దూరు పాఠశాల జిల్లాలోనే ఆదర్శంగా నిలిచిందని డీఈవో జనార్దన్‌రెడ్డి తెలిపారు. గురువారం మండలంలోని పెద్దబోదనం, మద్దూరు పాఠశాలలను ఆయన తనిఖీ చేశారు. విద్యార్థుల, ఉపాధ్యాయుల హాజరు, విద్యార్థుల సామర్థ్యాలు, అపార్‌ ఐడీల జనరేషన్‌, కిచెన్‌గార్డెన్‌ వంటి అంశాలను పరిశీ లించారు. మద్దూరు పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. ఉన్న త, ప్రాథమిక పాఠశాలల హెచ్‌ఎంలు మహబూబ్‌బాషా, రవీంద్రారెడ్డి కలిసి రూ.1.85 లక్షల వ్యయంతో తరగతి గదుల్లో గ్రానైట్‌ ఏర్పాటు చేసినం దుకు, విద్యార్థులకు ఐడెంటీ కార్డులు అందించినందుకు డీఈవో వారిని అభినందించారు. అనంతరం డీఈవో మాట్లాడుతూ జిల్లాలో 210 మోడల్‌ స్కూళ్లు, 107 కాంప్ల్లెక్సులు ఉన్నాయని అన్నారు. ఈ ఏడాది కొత్తగా 648 మంది ఉపాధ్యాయులను నియమించామని అన్నారు. పాఠశాలల్లో ప్రత్యేక ఆధార్‌ కేంద్రాల ద్వారా 91 శాతం పూర్తి చేశామని అన్నారు. జిల్లాలో 107 పాఠశాలల్లో కిచిన్‌ గార్డెన్‌లకు నిధులు మంజూరు చేశామని అన్నారు. కార్యక్రమంలో ఎంఈవో న్యామతుల్ల, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Updated Date - Nov 27 , 2025 | 11:51 PM