Share News

దడ పుట్టించిన ‘మొంథా’

ABN , Publish Date - Oct 30 , 2025 | 12:02 AM

మొంథా తుఫాన ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు మండలంలోని గ్రామాల్లోని వంకలు వాగులు పొంగి ప్రవహించాయి.

దడ పుట్టించిన ‘మొంథా’
ఉయ్యాలవాడలో మిరప పంటలో నిలిచిన వర్షపు నీరు

పొంగిన వాగులు, వంకలు

గ్రామాలకు నిలిచిన రాకపోకలు

వందలాది ఎకరాల్లో నీట మునిగిన పంటలు

ఉయ్యాలవాడ, అక్టోబరు 29(ఆంధ్రజ్యోతి): మొంథా తుఫాన ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు మండలంలోని గ్రామాల్లోని వంకలు వాగులు పొంగి ప్రవహించాయి. ఇంజేడు గ్రామ సమీపంలోని కుంద వాగు వంతెనపై నీరు ప్రవహిస్తుండటంతో ఆయా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వందలాది ఎకరాల్లో వరి, మిరప, పత్తి, మొక్కజొన్న పంటలు నీట మునిగాయి.

సంజామల: కురుస్తున్న వర్షాలకు మండలం లోని పాలేరు, కప్పల వాగు, గోండ్రవాగు పొంగి ప్రవహించాయి. కోతకు వచ్చిన మొక్కజొన్న పంట కోయ కుండానే విత్తనాలు మొలకెత్తుతున్నాయి. మిరప పంటలో భారీగా వర్షపు నీరు చేరింది. పాలేరువాగు పరివాహకంలో దాదాపు 1500 ఎక రాల్లో వరి పంట నీట మునిగాయి.

ఆళ్లగడ్డ: మొంథా తుఫాన ప్రభావంతో మండలంలోని పలు గ్రామాల్లో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. వకులా నది పరివాహక గ్రామాలైన ఓబులంపల్లె, జిజంబులదిన్నే, కోటకందుకూరు, ఆర్‌ క్రిష్ణాపురం, పాలసాగరం గ్రామాల రాకపోకలు స్తంభించాయి. పడకండ్ల గ్రామ సమీపంలోని ఆహోబిలం ప్రధాన రహదారిపై ప్రమాద స్థాయిలో వరద నీరు ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే కాశింతల క్షేత్రం వద్ద వకులా నది ఉగ్రరూం దాల్చింది. ఆలయం చుట్టు వరద నీరు చేరింది. ఆళ్లగడ్డ పట్టణంలోని కేసీ కాలువ కార్యాలయం వద్ద వంద సంవత్సరాల నాటి భారీవృక్షం నేల కూలింది.

రుద్రవరం: కురుస్తున్న వర్షాలకు మండలంలోని ఆలమూరులో 270 ఎకరాల్లో బొప్పాయి తోటలు, 180 ఎకరాల్లో మిరప దెబ్బతిన్నాయి. అలాగే సుమారు 1300 ఎకరాల్లో వరి పంట నేలవాలింది. రుద్రవరంలో మొలకాపురం మనోహర్‌ చెందిన రేకులషెడ్డు గోడ కూలింది. కోటకొండలో సత్యనా రా యణ మట్టి మిద్దె కూలింది. చిలకలూరు సమీ పంలో వకుళానది పొంగి ప్రవహించింది.

కూలిన మట్టిమిద్దెలు

కోవెలకుంట్ల: కురుస్తున్న వర్షాలకు పట్ట ణంలో గాంఽధీనగర్‌లో నివాసం ఉంటున్న శ్రీని వాసులుకు చెందిన మట్టిమిద్దె కూ లింది. అలాగే ఎరుకలపేటలోని సుర సుర జయమ్మ ఇల్లుకూడా కూలింది.

బనగానపల్లె: ఇటీవల కురిసిన వర్షానికి పట్టణంలోని ఈద్గానగర్‌లో సుబ్బారెడ్డికి చెందిన మట్టి మిద్దె బుధవారం కూలింది. కు టుంబ సభ్యులు తృటిలో ప్రాణాపాయం నుం చి తప్పించుకున్నారు.

బేతంచెర్ల: పట్టణంలోని దుర్గాపేట కాల నీలో కురుస్తున్న వర్షాలకు రెండు మట్టిమిద్దెలు మంగళవారం కూలిపోయాయి. బేతంచెర్ల పట్టణంలోని దుర్గాపేట కాలనీకి చెందిన గిత్త అయ్యమ్మ, దుర్గాపేట చెందిన నత్తి రామాంజ నేయులకు చెందిన మట్టిమిద్దెలు కూలిపో యాయి.

Updated Date - Oct 30 , 2025 | 12:02 AM