Share News

సుఖ సంతోషాల కోసమే మహా యాగం

ABN , Publish Date - Nov 04 , 2025 | 10:59 PM

ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండేందు కోసమే విశ్వశాంతి యాగం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ ఏ. సిరి అన్నారు.

సుఖ సంతోషాల కోసమే మహా యాగం
హోమంలో పాల్గొన్న కలెక్టర్‌ డా ఏ సిరి, ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌, ఎమ్మెల్యే జయనాగేశ్వర రెడ్డి

కల్టెర్‌ ఏ. సిరి

పాల్గొన్న ఎస్పీ విక్రాంత్‌, ఎమ్మెల్యే బీవీ

ఘన స్వాగతం పలికిన నిర్వాహకులు

ఐదో రోజుకు చేరిన విశ్వశాంతి యాగం

ఎమ్మిగనూరు, నవంబరు 4(ఆంధ్రజ్యోతి): ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండేందు కోసమే విశ్వశాంతి యాగం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ ఏ. సిరి అన్నారు. పట్టణంలోని వీవర్స్‌ కాలనీ మైదానంలో శ్రీ కృష్ణమఠం పీఠాధిపతి స్వరూపానంద స్వామిజీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 87వ విశ్వశాంతి యాగం ఐదో రోజుకు చేరుకుంది. మంగళవారం మహాయాగంలో కలెక్టర్‌తో పాటు ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌, ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి పాల్గొని హోమాలు నిర్వహించారు. వీరికి నిర్వాహకులు, అధికారులు ఘనస్వాగతం పలికారు. దాదాపు గంటన్నరకు పైగా హోమాల్లో కలెక్టర్‌, ఎస్పీ, ఎమ్మెల్యేలు హనుమత్‌ సహిత సుబ్రమణ్య హోమాలు, చండీహోమాలను పండితులు నిర్వహించారు. కలెక్టర్‌ సిరి మాట్లాడుతూ ప్రజలు భక్తి శ్రద్ధలతో యాగంలో పాల్గొనాలన్నారు. ఎమ్మె ల్యే బీవీ జయనాగేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ ఎమ్మిగనూరులో లోక కల్యాణం కోసం జరుగుతున్న అతిచండీ, అతి రుద్రయాగం వంటి హోమాలు జరగటం అదృష్టమన్నారు. కలెక్టర్‌, ఎస్పీ, ఎమ్మెల్యేలకు నిర్వాహకులు సన్మానించి ఆశీర్వాదం అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ గంగిరెడ్డి, తహసీల్దార్‌ శేషఫణి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మల్లయ్య, సీఐ శ్రీనివాసులు, నాయకులు మచాని మహేష్‌, శివశంకర్‌, మహేంద్ర, బీజేపీ నరసింహులు, శివ, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

Updated Date - Nov 04 , 2025 | 10:59 PM