మహోన్నత పాలకుడు శ్రీకృష్ణ దేవరాయలు
ABN , Publish Date - Aug 08 , 2025 | 12:21 AM
మహోన్నత పాలకుడు శ్రీకృష్ణ దేవరాయలు అని నగర బలిజ సంఘం గౌరవాధ్యక్షుడు, కళారత్న పత్తి ఓబులయ్య కొనియాడారు.
నగర బలిజ సంఘం గౌరవాధ్యక్షుడు పత్తి ఓబులయ్య
కర్నూలు కల్చరల్, ఆగస్టు 7(ఆంధ్రజ్యోతి): మహోన్నత పాలకుడు శ్రీకృష్ణ దేవరాయలు అని నగర బలిజ సంఘం గౌరవాధ్యక్షుడు, కళారత్న పత్తి ఓబులయ్య కొనియాడారు. గురువారం కృష ్ణరాయల 516వ పట్టాభిషేక దినోత్సవం సందర్భం గా నగర బలిజ సంఘం ఆధ్వర్యంలో నగరం లోని కిసానఘాట్ వద్ద గల శ్రీకృష్ణ దేవరాయల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. పత్తి ఓబులయ్య మాట్లాడుతూ దేశభాషలందు తెలుగు లెస్స అని తెలుగు భాష మాధుర్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత శ్రీకృష్ణదేవరాయలకే దక్కుతుందని శ్లాఘించారు. నగర బలిజ సంఘం అధ్యక్షుడు గాండ్ల లక్ష్మన్న, ప్రధాన కార్యదర్శి మండ్లెం రవికుమార్ మాట్లా డుతూ శ్రీకృష్ణ దేవరాయల జయంతిని అధికారికంగా నిర్వహించి, ఆయన చేసిన మంచి పనులును నేటి తరం ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని అన్నారు. సంఘం ప్రధాన సలహాదారు డాక్టర్ సింగంశెట్టి సోమ శేఖర్ మా ట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో నామినేటెడ్ పదవులు బలిజ లకు కేటాయించాలని కోరారు. కార్యక్రమంలో సంఘం నాయకులు శ్రీనివాస మూర్తి, శేలేష్, కార్పొరేటర్ స్వామిరెడ్డి, మార్కెట్ యార్డు డైరెక్టర్ పవనకు మార్, విజయ్‌కుమార్, విజయభాస్కర్, కిరణ్మయి, ప్రకాశబాబు, ఆంజనే యులు, చలపతి, ఈరన్న, శ్రీనివాస్, శ్రీకాంత పాల్గొన్నారు.