వైభవంగా వాదీంధ్రతీర్థుల ఆరాధనోత్సవాలు
ABN , Publish Date - Jun 05 , 2025 | 12:58 AM
రాఘవేంద్రస్వామి శిష్యులైన వాదీంధ్రతీర్థుల ఆరాధనోత్సవాలు వైభవంగా నిర్వహించారు.
వేలాదిగా పాల్గొన్న భక్తులు
ఆకట్టుకున్న ప్రవచనాలు
మంత్రాలయం, జూన 4(ఆంధ్రజ్యోతి): రాఘవేంద్రస్వామి శిష్యులైన వాదీంధ్రతీర్థుల ఆరాధనోత్సవాలు వైభవంగా నిర్వహించారు. బుధవారం మఠం పీఠాధిపతి సుబుధేంధ్రతీర్థులు వాధేంద్రతీర్థుల బృందావనానికి మహాభిషేకం చేసి హారతులు ఇచ్చారు. అనంతరం బంగారు రథంపై స్వామివారి బృందావనం చిత్రపటాన్ని అధిష్టించి ఆలయ ప్రాంగణం చుట్టూ ఊరేగించారు. యాగశాలలో ఊంజలసేవ నిర్వహించి ప్రవచనాలు ఇచ్చారు. పీఠాధిపతులు భక్తులనుద్దేశించి మాట్లాడుతూ వాదీంద్రతీర్థులు తన గురువులైన రాఘవేంద్రస్వామిని ఎంతగానో అభిమానించే ప్రియశిష్యులుగా ఎన్నో గ్రంథాలు రచించి రాఘవేంద్రస్వామి బృందావనం పక్కనే వెలిశారని కొనియాడారు. పీఠాధిపతి భక్తులను ఆశీర్వదించారు. కార్యక్రమంలో ఏఏవో మాధవ శెట్టి, మఠం మేనేజర్లు ఎస్‌కే శ్రీనివాసరావు, వెంకటేష్ జోషి, సురేష్ కోనాపూర్, సుజీంధ్రాచార్, ఆనందతీర్థాచార్, గౌతమాచార్, శ్రీపతాచార్, డీఎం ఆనందరావు, జేపీ స్వామి, విజేంద్రాచార్, రవికులకర్ణి, వ్యాస రాజాచార్, వాధిరాజాచార్, హనుమేషాచార్, పద్మనాబాచార్ తదితరులు పాల్గొన్నారు.