వైభవంగా గౌరమ్మ నిమజ్జనం
ABN , Publish Date - Nov 09 , 2025 | 11:56 PM
చాగలమర్రి గ్రామంలోని బుగ్గమల్లేశ్వర ఆలయంలో కార్తీకమాసం సందర్భంగా ఆదివారం మహిళలు సామూహికంగా గౌరమ్మ నిమజ్జనాన్ని వైభవంగా నిర్వ హించారు.
చాగలమర్రి, నవంబరు 9(ఆంధ్రజ్యోతి): చాగలమర్రి గ్రామంలోని బుగ్గమల్లేశ్వర ఆలయంలో కార్తీకమాసం సందర్భంగా ఆదివారం మహిళలు సామూహికంగా గౌరమ్మ నిమజ్జనాన్ని వైభవంగా నిర్వ హించారు. అంతకముందు కన్యకాపరమేశ్వరి ఆలయంలో ప్రతిష్ఠించిన గౌరమ్మ విగ్రహాన్ని వీధుల గుండా గ్రామోత్సవం చేశారు. బుగ్గమ ల్లేశ్వర ఆలయంలోగల కొనేరులో గౌరమ్మకు పూజలు చేసి నీటిలో వదిలేశారు. శివపార్వతుల వద్ద మహిళలు దీపాలు వెలిగించారు.