Share News

వైభవంగా చెన్నకేశవస్వామి రథోత్సవం

ABN , Publish Date - Apr 13 , 2025 | 01:07 AM

మండలంలోని ఎర్రబాడు గ్రామంలో అంపయ్య పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని గ్రామప్ర జలు, భక్తులు చెన్నకేశవస్వామి రథోత్సవాన్ని శనివారం అంగరంగ వైభవంగా జరుపుకున్నారు.

వైభవంగా చెన్నకేశవస్వామి రథోత్సవం
గోనెగండ్ల మండలం వేముగోడులో రథోత్సవానికి హాజరైన భక్తులు

తరలివచ్చిన భక్తులు

గోనెగండ్ల, ఏప్రిల్‌ 12(ఆంధ్రజ్యోతి): మండలంలోని ఎర్రబాడు గ్రామంలో అంపయ్య పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని గ్రామప్ర జలు, భక్తులు చెన్నకేశవస్వామి రథోత్సవాన్ని శనివారం అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. రెండు రోజలుగా జాతరను పురస్కరిం చుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారిని ప్రత్యేకంగా వెండి ఆభరణాలతో, పట్టువస్ర్తాలతో ప్రత్యేకంగా శోభాయమానంగా అలంకరించారు. చెన్నకేశవస్వామి దేవాలయం నుంచి ఈశ్వరదేవాలయం వరకు రథాన్ని లాగారు. అలాగే అయ్యకొండ గ్రామంలో చింతలాముని నల్లారెడ్డి స్వామి వారి ప్రభోత్సవం కన్నుల పండుగగా సాగింది. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారికి మొక్కులు తీర్చుకున్నారు. రాత్రి భజన కార్యక్రమాన్ని నిర్వాహకులు ఏర్పాటు చేశారు. అలాగే వేముగోడు గ్రామంలో సుంకులాపరమేశ్వరి దేవి జాతర రథోత్సవాన్ని భక్తులు అంగరంగ వైభవంగా జరుపుకు న్నారు. అమ్మవారిని పట్టు వస్ర్తాలతో ప్రత్యేకంగా అలంకరించారు. గ్రామ శివార్ల వరకు రఽథం లాగారు. అంతకుముందు దేవాలయం దగ్గర ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరకుండా సీఐ విజయభాస్కర్‌ బందోబస్తు నిర్వహించారు.

ఘనంగా చెన్నకేశవస్వామి ప్రభోత్సవం

ఎమ్మిగనూరు రూరల్‌: ఎమ్మిగనూరు మండల పరిధిలోని కొటేకల్లు గ్రామంలో శనివారం చెన్నకేశవస్వామి ప్రభోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి స్వామివార్లకు అర్చకులు నరసింహా చారి ఆధ్వర్యంలో జలాభిషేకం, హోమం, పుష్పాభిషేకం, కుంకుమార్చన, మహామంగళహారతి ఇచ్చి ప్రత్యేక అలంకరణలు చేశారు. సాయంత్రం స్వామివారి ప్రభోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.

రామదాసుస్వామి రథోత్సవం: మండల పరిధిలోని సిరాలదొడ్డి గ్రామంలో రామదాసు స్వామి రథోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచి స్వామివారికి అర్చకులు జలాభిషేకం, పుష్పాభిషేకం, కుంకుమార్చన నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. గ్రామంలోని భక్తులు స్వామివారికి నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. సాయంత్రం స్వామివారి రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. భక్తులు స్వామి రథోత్సవానికి గజమాలలతో అలకరించారు. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Updated Date - Apr 13 , 2025 | 01:07 AM