Share News

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

ABN , Publish Date - Jun 02 , 2025 | 12:35 AM

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి అన్నారు.

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
పసుపులలో రేషన పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే దస్తగిరి

కోడుమూరు ఎమ్మెల్యే

చౌకదుకాణాల్లో రేషన పంపిణీ

కర్నూలు రూరల్‌ జూన 1(ఆంధ్రజ్యోతి): ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి అన్నారు. కర్నూలు మండలం పసుపుల, నూతనపల్లె గ్రామాల్లో ఆదివారం చౌక దుకాణాలను ఎమ్మెల్యే ప్రారంభించి, రేషన పంపిణీ చేశారు. ఈసంద ర్భంగా ఆయన మాట్లాడుతూ డీలర్లు అవకతవకలకు పాల్పడకుండా ప్రజలకు రేషన పంపిణీ చేయాలన్నారు. కార్యక్రమంలో రూరల్‌ తహ సీల్దార్‌ వెంకటరమేష్‌బాబు, వీఆర్వో, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

కర్నూలు అర్బన: నగరంలోని 14, 15, 16 డివిజన్లలో రేషన దుకాణాలను తెలుగుయువత జిల్లా అధ్యక్షుడు అబ్బాస్‌తో కలిసి మాజీ కార్పొరేటర్లు రామంజనేయులు, పామన్న, విజయకుమారిలు ఆదివారం ప్రారంభించారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కె.జగన్నాథం, డీలర్‌ హనుమంతరావు పాల్గొన్నారు.

ఓర్వకల్లు: మండల కేంద్రమైన ఓర్వకల్లులో టీడీపీ మండల కన్వీనర్‌ గోవిందరెడ్డి, నాయకులు రాంభూపాల్‌ రెడ్డి, లక్ష్మికాంతరెడ్డి, భాస్కర్‌ రెడ్డి, అన్వర్‌బాషా కార్డుదారులకు రేషన పంపిణీ చేశారు. అదేవిధంగా హుశేనాపురం, నన్నూరు, తదితర గ్రామాల్లో టీడీపీ నాయకులు, అధికా రులు రేషన పంపిణీ చేశారు. కార్యక్రమంలో కాల్వబుగ్గ మాజీ చైర్మన్లు చంద్రపెద్దస్వామి, సుధాకర్‌, తహసీల్దార్‌ విద్యాసాగర్‌, టీడీపీ నాయ కులు విశేశ్వరరెడ్డి, డీలర్లు పాల్గొన్నారు.

Updated Date - Jun 02 , 2025 | 12:35 AM