రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
ABN , Publish Date - Nov 20 , 2025 | 12:40 AM
రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు.
ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
అన్నదాత సుఖీభవ.. పీఎం కిసాన చెక్కుల విడుదల
ఉయ్యాలవాడ, నవంబరు 19(ఆంధ్రజ్యోతి): రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు. బుధవా రం మండలం కేంద్రంలోని స్థానిక ఫంక్షన హాలులో అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన చెక్కులను ఆమె విడుదల చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్నదాత సుఖీభవ రెండో విడతలో భాగంగా ఆళ్లగడ్డ నియోజక వర్గంలోని ఆరు మండలాల్లో 42,981 మంది రైతులకు రూ. 29.13 కోట్ల నిధులు రైతుల ఖాతాల్లో జమ అవుతాయన్నారు. ఒక్కో రైతులకు రూ. 7 వేల చొప్పున ప్రభుత్వం ఇస్తుందని ఆమె తెలిపారు. మండలంలోని ఆర్.జంబులదిన్నె, ఇంజేడు, సుద్దమల్ల, నర్శిపల్లె గ్రామాల్లో హరివరం కేసీకెనాల్ చానల్ ద్వారా సాగునీరు అందిం చేందుకు రూ. 22 కోట్ల నిధులు సీఎం చంద్రబాబు ఇచ్చారని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో డ్వామా పీడీ శ్రీనివాసులు, ఏడీఏ విజయశేఖర్, తహసీల్దారు ప్రసాద్ బాబు, ఎంపీడీవో ఉమామమహేశ్వరరావు, టీడీపీ మండల కన్వినర్ బోరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, నాయకులు కూడాల నారాయణరెడ్డి, మారంరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, నర్శిరెడ్డి, కర్నాటి మహేశ్వరరెడ్డి పాల్గొన్నారు.