Share News

అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

ABN , Publish Date - Jul 19 , 2025 | 01:13 AM

అభివృద్ధి, సంక్షే మమే ప్రభుత్వ లక్ష్యమని కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి అన్నారు.

అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
ప్రజలకు కరపత్రాన్ని అందిస్తున్న ఎమ్మెల్యే దస్తగిరి

కోడుమూరు ఎమ్మెల్యే దస్తగిరి

కర్నూలు రూరల్‌, జూలై 18(ఆంధ్రజ్యోతి): అభివృద్ధి, సంక్షే మమే ప్రభుత్వ లక్ష్యమని కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి అన్నారు. శుక్రవారం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఆయన కర్నూలు మండలం దిగువపాడు, శివరాంపురం గ్రామాల్లో ఇంటింటికి తిరిగి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించి, కరపత్రాలు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే దస్తగిరి మాట్లాడుతూ రాబోయే 4 ఏళ్లలో సంక్షేమం, అభివృద్ధిలో రాషా్ట్రన్ని దేశంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయ కులు, గ్రామ పెద్దలు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jul 19 , 2025 | 01:13 AM