ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం స్పందించాలి
ABN , Publish Date - Aug 05 , 2025 | 11:34 PM
రాష్ట్రంలో ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం స్పందించాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు నా గేంద్రప్ప అన్నారు.
ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు నాగేంద్రప్ప
నంద్యాల ఎడ్యుకేషన్, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం స్పందించాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు నా గేంద్రప్ప అన్నారు. మంగళవారం రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు నంద్యాల మైనర్ ఇరిగేషన్ కార్యాలయం వద్ద ‘రండి టీ తాగుతూ మాట్లాడుకుందాం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పాలకులు ఉద్యోగులను పూర్తిగా విస్మరించారని, నేటి ప్రభుత్వంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఉద్యోగుల సమస్యలపై స్పందించకపోవడం ఆవేదనకు గురిచేస్తోందనన్నారు. రాష్ట్రఅధ్యక్షుడు సూర్యనారాయణ పుట్టినరోజు సందర్భంగా కేకును కట్‌చేశారు. నాయకులు సుధాకర్, శ్రీనివాసులు, తిరుపాల్, ఫకృద్దీన్, విజయలక్ష్మి, సురేష్ పాల్గొన్నారు.