Share News

పొగాకును ప్రభుత్వమే కొనుగోలు చేయాలి

ABN , Publish Date - Jul 27 , 2025 | 12:33 AM

జిల్లాలో రైతులు సాగు చేసిన పొగాకును ప్రభుత్వ మే కొనుగోలు చేయాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు.

పొగాకును ప్రభుత్వమే కొనుగోలు చేయాలి
మాట్లాడుతున్న ప్రభాకర్‌రెడ్డి

ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి

కర్నూలు న్యూసిటీ, జూలై 26(ఆంధ్రజ్యోతి): జిల్లాలో రైతులు సాగు చేసిన పొగాకును ప్రభుత్వ మే కొనుగోలు చేయాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. శనివారం కేకే భవనలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లా డారు. జిల్లాలో గత రెండేళ్ల నుంచి రైతులు పొగాకును విస్తారంగా సాగు చేస్తున్నారని అన్నారు. గతేడాది రేటు బాగా పలకడంతో రైతు లు పొగాకు పంట వైపు మళ్లారని అన్నారు. ఈ సంవత్సరం అత్య ధికంగా రైతులు పొగాకు పంట సాగు చేయ డం వల్ల కంపెనీ ప్రతినిధులు రేటు పూర్తిగా తగ్గిచారని అన్నారు. గతంలో రూ.18 వేలు ఉండగా ప్రస్తుతం రూ.15వేలు ఇస్తామని చెప్పడం దారుణమ న్నారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి రామక్రిష్ణ ఉన్నారు.

Updated Date - Jul 27 , 2025 | 12:33 AM