Share News

హామీల అమలులో ప్రభుత్వం విఫలం

ABN , Publish Date - Jul 19 , 2025 | 01:11 AM

సూపర్‌ సిక్స్‌ హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందని వైసీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి విమర్శించారు.

హామీల అమలులో ప్రభుత్వం విఫలం
మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌ రెడ్డి

మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి

ఓర్వకల్లు, జూలై 18(ఆంధ్రజ్యోతి): సూపర్‌ సిక్స్‌ హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందని వైసీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి విమర్శించారు. శుక్రవారం మండలంలోని ఓర్వ కల్లు జీవేశ్వరస్వామి ఆలయంలో బాబు ష్యూరిటీ - మోసం గ్యారెంటీ కార్యక్రమంపై మండల స్థాయి విస్తృత సమావేశం నిర్వహించారు. సాయం త్రం మోసం గ్యారెంటీ.. ఇంటింటికి వంచన కార్యక్రమం నిర్వహించారు. కాటసాని మాట్లాడుతూ గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ క్యూఆర్‌ కోడ్‌ ద్వారా గత ఏడాది కాలంలో ప్రతి కుటుంబం ఎంత నష్టపో యిందో వివరిం చారు. కార్యక్రమంలో నాయకులు ప్రభాకర్‌రెడ్డి, రంగనా థగౌడు, విష్ణువర్ద నరెడ్డి శంకర్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, తిప్పన్న, చెన్నారెడ్డి, హరినాథగౌడు, నాగతిరుపాలు, రమణారెడ్డి, మధుసూదన పాల్గొన్నారు.

Updated Date - Jul 19 , 2025 | 01:11 AM