Share News

టీడీపీ బలోపేతమే లక్ష్యం

ABN , Publish Date - Dec 26 , 2025 | 11:36 PM

టీడీపీ బలోపేతమే లక్ష్యం

టీడీపీ బలోపేతమే లక్ష్యం
మంత్రిని కలిసిన టీడీపీ జిల్లా అధ్యక్షులు, నాయకులు

మంత్రి టీజీ భరత్‌ను కలిసిన జిల్లాల బాధ్యులు

కర్నూలు, అనంతపురం జిల్లాలకు కొత్త అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు

కర్నూలు అర్బన్‌, డిసెంబరు 26(ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ బ లోపేతమే లక్ష్యంగా పని చేయలని మంత్రి టీజీ భరత్‌ అన్నారు. శుక్రవారం సాయంత్రం అనంతపురం జిల్లా అధ్యక్షుడు పూలనాగరాజు, జిల్లా ప్రధాన కార్య దర్శి జీ శ్రీధర్‌చౌదరి, కర్నూలు జిల్లా అధ్యక్షురాలు గుడిసె క్రిష్ణమ్మ, ప్రధాన కార్య దర్శి పూల నాగరాజుయాదవ్‌ మర్యాద పూర్వకంగా నగరంలోని మంత్రి ఛాంబర్‌లో ఆయనను కలిసి శాలువాలతో సత్కరించారు. అనంతరం జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ స్థితిగతులపై చర్చించారు. బాధ్యతలు తీసుకున్న తర్వాత రెండు జిల్లాల నాయకులు మొదటిసారి మంత్రిని కలిశారు. కర్నూలు జిల్లా అధ్యక్షురాలు గుడిసె క్రిష్ణమ్మ బాధ్యతలు తీసుకున్న వెంటనే రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌, శాసన మండలి కమిటీ చైర్మన్‌, ఎమ్మెల్సీ బీటీ నాయుడు, కేడీసీసీబీ చైర్మన్‌ విష్ణువర్ధన్‌రెడ్డిలను కలిశారు.

Updated Date - Dec 26 , 2025 | 11:36 PM