ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం
ABN , Publish Date - Dec 13 , 2025 | 12:54 AM
ప్రజా సమస్యలను తర్వగా పరిష్కరించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రి య అన్నారు.
ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
చాగలమర్రి, డిసెంబరు 12(ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యలను తర్వగా పరిష్కరించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రి య అన్నారు. శుక్రవారం చాగలమర్రి ఎంపీడీవో కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆమె పాల్గొని ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ గ్రీవెన్సలో 200 పైగా అర్జీలు వచ్చాయని, వాటిని పరిష్కరించేలా చూడాలని అధికారు లకు ఆదేశించామని అన్నారు. చాగలమర్రి మండలంలో 11 విలేజ్ హెల్త్ క్లినిక్‌లకు రూ.4.44 కోట్లు, పల్లె పండుగలో భాగంగా ఫెస్-2 కింద రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి రూ.2.20 నిధులు మంజూరు చేశామని అన్నారు. ఆళ్లగడ్డ నియోజకవర్గానికి ప్రభుత్వం రోడ్ల కోసం రూ.12 కోట్లు మంజూరు చేసిందన్నారు. చాగలమర్రి నుంచి చిన్నవంగలి, గొడిగనూరు, డి.వనిపెంట మీదుగా కేపీ తాండ, చక్రవర్తులపల్లె గ్రామాలకు తారు రోడ్డు నిర్మాణానికి రూ.9.30 కోట్లు మంజూరయ్యాయని అన్నారు. అభివృద్ధి చూసి ఓర్వలేకనే వైసీపీ నాయకులు స్థాయి మరిచి విమర్శలు చేస్తున్నారన్నారు. కార్యక్ర మం లో మండల ప్రత్యేక అధికారి జగ్గయ్య, తహసీల్దార్ విజయ్‌కుమార్, పీఆర్ డీఈ వెంకట్‌రెడ్డి, ఎంపీడీవో తాహిర్‌హుసేన, డిప్యూటీ ఎంపీడీవో తార కేశ్వరి, ఎంఈవోలు అనూరాధ, న్యామతుల్ల, ఏవో రంగనేతాజీ, హెచవో దస్త గిరి, వైద్యులు ఇమ్రాన, ఏఈలు జగ్గయ్య, రమణయ్య, సింగిల్‌విండో అధ్య క్షుడు ఉసేనరెడ్డి, టీడీపీ నాయకులు నరసింహారెడ్డి, అన్సర్‌బాషా, సల్లా నాగరాజు, మౌళాలి, జెట్టి నాగరాజు, అనిఫ్ పాల్గొన్నారు.