ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం
ABN , Publish Date - Aug 30 , 2025 | 01:04 AM
ప్రజా సమస్యల పరిష్కారమే తమ లక్ష్యమని కమిషనర్ పి.విశ్వనాథ్ అన్నారు.
ప్రతి శుక్రవారం ‘ఓపెన ఫోరం’
నగర పాలక కమిషనర్ విశ్వనాథ్
కర్నూలు న్యూసిటీ, ఆగస్టు 29(ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల పరిష్కారమే తమ లక్ష్యమని కమిషనర్ పి.విశ్వనాథ్ అన్నారు. శుక్రవా రం స్థానిక ఎస్‌బీఐ కాలనీలోని నగర పాలక సమావేశ భవనంలో ఓపెన ఫోరం కార్యక్రమం నిర్వహించారు. వివిధ ప్రాంతాలకు చెరందిన పలువురు పౌరులు ఎల్‌ఆర్‌ఎస్, నిర్మాణ అనుమతులు, అక్రమ నిర్మాణా లపై అర్జీలు సమర్పించారు. పలువురు సందేహాలను వ్యక్తం చేయగా, కమిషనర్ నివృత్తి చేశారు. కొన్ని సమస్యల పరిష్కారంలో జాప్యం జరుగుతుందని పౌరులు కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. అక్కడిక్కడే పట్టణ ప్రణాళిక విభాగ అధికారులు, ప్లానింగ్ కార్యదర్శులను కమి షనర్ కారణాలు అడిగి తెలుసుకున్నారు. కమిషనర్ మాట్లాడుతూ నగ రంలోని ప్రజా సమస్యలను ప్రత్యక్షంగా విని, తక్షణ పరిష్కారానికి చర్యలు చేపట్టేందుకు ‘ఓపెన ఫోరం’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామ న్నారు. సమావేశంలో సిటీ ప్లానర్ ప్రదీప్‌కుమార్, డీసీపీ బి.వెంకట రమణ, టౌనప్లానింగ్ సూపర్‌వైజర్ అంజాద్‌బాషా, సూపరింటెండెంట్ సుబ్బన్న, బిల్డింగ్ ఇనస్పెక్టర్లు, ప్లానింగ్ కార్యదర్శులు, ఎల్‌టీపీలు, ప్రజలు పాల్గొన్నారు.