Share News

సమస్యల పరిష్కారమే లక్ష్యం

ABN , Publish Date - Nov 22 , 2025 | 12:26 AM

ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ రెడ్డి అన్నారు.

సమస్యల పరిష్కారమే లక్ష్యం
ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తున్న ఎమ్మెల్యే కోట్ల

ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ రెడ్డి

డోన టౌన, నవంబరు 21(ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ రెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని ఆర్‌అండ్‌బీ గెస్టు హౌస్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. మండలంలోని అన్ని గ్రామాలు, పట్టణ ప్రజల నుంచి వచ్చిన వినతులను ఎమ్మెల్యే కోట్ల స్వీకరించారు. ఎమ్మెల్యే కోట్ల మాట్లాడుతూ గత ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరు స్తా మని, నంద్యాల జిల్లాలో ఉన్న డోనను కర్నూలు జిల్లాలో కలిపేందుకు కృషి చేస్తానని అన్నారు.

డీలర్‌పై చర్యలు తీసుకోండి: మండలంలోని వలసల గ్రామానికి చెందిన రేషన డీలర్‌ సుదర్శనరెడ్డిపై చర్యలు తీసుకోవాలని టీడీపీ నాయకుడు సుధాకర్‌ మరికొందరు ఎమ్మెల్యే కోట్లకు అర్జీ సమర్పించారు.

నాణ్యమైన భోజనం అందించాలి: విద్యార్థులకు నాణ్యమైన భోజ నం అందించాలని ఎమ్మెల్యే కోట్ల ఆదేశించారు. శుక్రవారం కాలనీలో నెహ్రూనగర్‌ కాలనీలో పాఠశాలను పరిశీలించి విద్యార్థులకు అందించే భోజనం చూసి ఎమ్మెల్యే కోట్ల రుచి చూశారు.

ఎమ్మెల్యేకు సన్మానం: ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి వేడుకల్లో భాగంగా ఎమ్మెల్యే కోట్లని శుక్రవారం ఆర్‌అండ్‌బీ గెస్టు హౌస్‌లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం కార్యదర్శి ఏఈ నాగరాజుగౌడులు కలిసి ఝాన్సీ లక్ష్మీబాయి చిత్రపటాన్ని అందజేసి సత్కరించారు. కార్యక్రమం లో డీఎస్పీ శ్రీనివాస్‌, మున్సిపల్‌ కమిషనర్‌ ప్రసాద్‌గౌడు, తహసీల్దార్‌ రవికుమార్‌, ఎంపీడీవో జీ.వెంకటేశ్వరరెడ్డి, సీఐ ఇంతియాజ్‌బాషా, ఆర్‌డబ్ల్యూఎస్‌ డీఈ రమేష్‌ కుమార్‌ రెడ్డి, పీఆర్‌ డీఈ గంగాధర్‌, ఆర్‌అండ్‌బీ డీఈ శ్రీనివాసులు, పీఆర్‌ ఏఈ నారాయణ, టీడీపీ నాయ కులు వలసల రామకృష్ణ, దశరథరామిరెడ్డి, టీఈ రాఘవేంద్రగౌడు, శేషిరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Nov 22 , 2025 | 12:26 AM