Share News

కనీస సౌకర్యాల కల్పనే లక్ష్యం

ABN , Publish Date - May 24 , 2025 | 12:26 AM

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి శూన్యమని, కూటమి ప్రభుత్వానికి కనీస సౌకర్యాల కల్పనే లక్ష్యమని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ మంత్రి టీజీ భరత్‌ అన్నారు.

కనీస సౌకర్యాల కల్పనే లక్ష్యం
శంకుస్థాపన చేస్తున్న మంత్రి టీజీ భరత్‌

పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ మంత్రి టీజీ భరత్‌

రూ.12.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

కర్నూలు న్యూసిటీ, మే 23(ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి శూన్యమని, కూటమి ప్రభుత్వానికి కనీస సౌకర్యాల కల్పనే లక్ష్యమని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ మంత్రి టీజీ భరత్‌ అన్నారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో నడిచేలా కృషి చేస్తున్నామని మంత్రి తెలిపారు. శుక్రవారం కర్నూలు నియోజకవర్గ పరిధిలోని 19 వార్డులలో 15వ ఆర్థిక సంఘం, ఎన్‌క్యాప్‌, సాధారణ నిధులకు సంబంధించి రూ.12.30 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు మంత్రి, నగర పాలక కమిషనర్‌ ఎస్‌. రవీంద్రబాబుతో కలిసి శంకుస్థాపనలు చేశారు. అశోక్‌నగర్‌ రైల్వే బ్రిడ్జి వద్ద సీసీ రోడ్లు, కాలువలు, కేసీ కెనాల్‌ బ్రిడ్జి జలమండలి వద్ద సీసీ రోడ్లు, కాలువలు, ఎస్‌ఏపీ క్యాంపు జాతీయ రహదారి వద్ద కనెక్టివిటీ రోడ్డు, నగరేశ్వరస్వామి ఆలయం వద్ద సీసీ రోడ్లు, కాలువలు, బండిమెట్ట శ్రీపొట్టిశ్రీరాములు మున్సిపల్‌ పాఠశాల వద్ద సీసీ రోడ్లు, కాలువలు, బుధవారపేట హంద్రీ బ్రిడ్జి వద్ద సీసీ రోడ్లు, కాలువలు, సి. క్యాంపి సెంటర్‌లో రోడ్డు, సి. క్యాంపు నుంచి బిర్లాగేట్‌ పోస్టాఫీసు వరకు సీసీ రోడ్డు విస్తరణ పనులకు మంత్రి టీజీ భరత్‌ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత్‌ మాట్లాడుతూ నగరవాసులకు ప్రధానంగా రోడ్లు, డ్రైనేజీల, వీధిదీపాలు, వార్డుల్లో పరిశుభ్రత ఎంతో ముఖ్యమన్నారు. వీటన్నింటిని కల్పించేందకు తాను కృషి చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కురువ పరమేష్‌, క్రాంతికుమార్‌, రమణమ్మ, ఇన్‌చార్జి ఎస్‌ఈ శేషసాయి, ఈఈ సత్యనారాయణ, డీఈఈలు క్రిష్ణలత, గంగాధర్‌, శ్రీనివాసరెడ్డి, వార్డు ఇన్‌చార్జిలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 24 , 2025 | 12:26 AM