Share News

పేదలకు వైద్య సేవలందించడమే లక్ష్యం

ABN , Publish Date - Nov 06 , 2025 | 11:44 PM

పేద రోగులకు వైద్య సేవలందించడమే లక్ష్యమని జీజీజీహెచ్‌ సూపరింటెం డెంట్‌ వెంకటేశ్వర్లు అన్నారు.

పేదలకు వైద్య సేవలందించడమే లక్ష్యం
అఖిల భారత సర్వీస్‌ అధికారులతో జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వెంకటేశ్వర్లు

జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ వెంకటేశ్వర్లు

ఆస్పత్రిలో అఖిల భారత సర్వీసు అధికారుల బృందం పర్యటన

కర్నూలు హాస్పిటల్‌, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): పేద రోగులకు వైద్య సేవలందించడమే లక్ష్యమని జీజీజీహెచ్‌ సూపరింటెం డెంట్‌ వెంకటేశ్వర్లు అన్నారు. జిల్లాకు శిక్షణ కోసం వచ్చిన అఖిల భారత సర్వీసుల అధికారుల బృందం గురువారం ఉదయం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో పర్యటించారు. శిక్షణ పొందుతున్న 15 మంది అధికారుల బృందం ఆస్పత్రిలోని సూపర్‌ స్పెషాలిటీ బ్లాక్‌, ఓపీ, ఐసీ కౌంటర్లలో సేవలను పరిశీలించారు. రోగులకు అందుతున్న వైద్యసేవలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి లభిస్తున్న కుటుంబ సంక్షేమ పథకాలు, వైద్య పరికరాలు, సదుపాయాల గురించి సమగ్రంగా అడిగి తెలుసుకున్నారు. విపరీతంగా రోగుల రద్దీ ఉన్న న్యూడయోగ్నస్టిక్‌ బ్లాక్‌, ఓపీ కౌంటర్లను పరిశీలించి రోగులతో మాట్లాడారు. అనంతరం కర్నూలు జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ వెంకటేశ్వర్లును కలిశారు. ఆసుపత్రి కార్యకలాపాలు, వైద్యసేవలు, ఆరోగ్య పథకాలపై బృందానికి సూపరింటెండెంట్‌ వివరించారు. ప్రతి రోజు 3వేల నుంచి 3,500 మంది రోగులు వస్తుంటారని తెలిపారు. ఈ సందర్భంగా భుజం నొప్పికి శస్త్రచికిత్స చేసుకున్న హర్యానాకు చెందిన ట్రైనీ ఐఏఎస్‌ డిపెంధర్‌ మాట్లాడుతూ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిని మరువలేనని సూపరింటెండెంట్‌ చికిత్స చేయడంతోనే కోలుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అఖిల భారత సర్వీసుల అధికారులు, హాస్పిటల్‌ ఆర్‌ఎంవో డా. టీసీహెచ్‌ వెంకటరమణ, అడ్మినిస్ర్టేటర్‌ సింధూ సుబ్రహ్మణ్యం, హాస్పిటల్‌ అడ్మినిస్ర్టేషన్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ కిరణ్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 06 , 2025 | 11:44 PM