సాగునీరు అందించడమే లక్ష్యం
ABN , Publish Date - Nov 21 , 2025 | 11:19 PM
జిల్లాలో రైతాంగానికి సాగు నీరు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం అని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు.
జీడీపీ కుడి కాలువకు నీరు విడుదల
గోనెగండ్ల, నవంబరు 21(ఆంధ్రజ్యోతి): జిల్లాలో రైతాంగానికి సాగు నీరు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం అని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు. శుక్రవారం గాజులదిన్నె ప్రాజెక్టులోని నీటికి గంగ పూజ చేసి ప్రాజెక్టు కుడి కాలువ ద్వారా ఆయకట్టు రైతులకు ఎమ్మెల్యే బీవీ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది రబీ సీజన్‌లో ఆయకట్టు రైతులకు సాగు నీరు విడుదల చేస్తున్నామని, ప్రాజెక్టులో 3 టీఎంసీ నీరు ఉన్నందుకు ప్రస్తుతం 13వేల ఎకరాలకు సాగునీరు విడుదల చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఎస్‌ఈ బాలచంద్రారెడ్డి, ఈఈ పాండురంగయ్య, డీఈ సుబ్బరాయుడు, ఏఈ మహుమ్మద్ ఆలీ, ఉగ్రనరసింహుడు, టీడీపీ నాయకులు తిరుపతయ్యనాయుడు, రామాంజినేయలు పాల్గొన్నారు.
రాయలసీమకు ఇక్కడి నుంచే చేప పిల్లల సరఫరా
గాజులదిన్నె ప్రాజెక్టు నుంచి చేప పిల్లలను రాయలసీమలోని అన్ని జిల్లాలకు పంపిణీ చేసేలా చూస్తామని ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వరరెడ్ది అన్నారు. శుక్రవారం ప్రపంచ మత్స్య దినోత్సవం సంద ర్భంగా మన చెరువు మన సీడ్ పథకం కింద గాజులదిన్నె ప్రా జెక్టు లోని పాండ్స్‌లో మత్స్య కార్మికులు స్వంత ఖర్చులతో సిద్ధం చేసు కున్న 25లక్షల చేప పిల్లలను వదిలారు. ఈ కార్యక్రమంలో మత్స్య శాఖ అధికారి నాగరాజు, జిల్లా మత్స్య కార్పొరేష్‌న్ డైరెక్టర్ రామాంజినేయులు, పోతుల శేఖర్, తహసీల్దార్ రాజేశ్వరి పాల్గొన్నారు.