మెరుగైన సేవలందించడమే లక్ష్యం
ABN , Publish Date - Dec 27 , 2025 | 11:28 PM
సామాన్యులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని చేరువ చేసి మెరుగైన సేవలందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర న్యాయ, మైనార్టీ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ అన్నారు.
రాష్ట్ర న్యాయ, మైనార్టీ శాఖ మంత్రి ఫరూక్
నంద్యాల రూరల్, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి) : సామాన్యులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని చేరువ చేసి మెరుగైన సేవలందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర న్యాయ, మైనార్టీ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ అన్నారు. శనివారం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో అంగన్‌వాడీ టీచర్లకు 5జీ మొబైల్ ఫోన్లను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారుల వివరాలు, వారి ఆరోగ్య స్థితిగతులు, ఇతర సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసేందుకు వీలుగా మొబైల్స్ పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. చిన్నారుల విషయంలో కార్యకర్తలు బాధ్యతగా వ్యవహరించాలన్నారు. కేంద్రాల్లో ఎలాంటి సమస్యలున్న తమ దృష్టికి తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.