Share News

‘సీమ’ను సస్యశ్యామలం చేయడమే లక్ష్యం

ABN , Publish Date - Aug 31 , 2025 | 12:23 AM

రాష్ట్రంలో తాగు, సాగునీటి ప్రాజెక్టులను వరద జలాలతో నింపి కరువు సీమను సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు.

‘సీమ’ను సస్యశ్యామలం చేయడమే లక్ష్యం
కృష్ణమ్మకు జలహారతి ఇస్తున్న ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి

సీఎం చంద్రబాబు చిత్రపటానికి క్షీరాభిషేకం

పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి

కృష్ణమ్మకు జలహారతి

కల్లూరు, ఆగస్టు 30(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో తాగు, సాగునీటి ప్రాజెక్టులను వరద జలాలతో నింపి కరువు సీమను సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు. శనివారం కల్లూరు మండలం చిన్న టేకూరు సమీపంలోని హెచఎనఎస్‌ఎస్‌ బ్రాంచ కెనాల్‌ వద్ద ఎమ్మెల్యే జలహారతిలో పాల్గొన్నారు. కృష్ణానది జలాలను విడుదల చేసిన చం ద్రబాబు చిత్రపటానికి ఎమ్మెల్యే గౌరు చరిత ఆధ్వర్యంలో క్షీరాభిషేకం చేశారు. గౌరుచరిత మాట్లాడుతూ సీఎం చంద్రబాబు రైతుల సంక్షే మానికి పెద్దపీట వేశారన్నారు. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులను యుద్ధప్రతిపాదికన పూర్తికి చర్యలు తీసుకున్నారన్నారు. కార్యక్రమంలో నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్‌, యువ నాయకుడు గౌరు జనార్దనరెడ్డి, ఏపీ విశ్వబ్రాహ్మణ కార్పొరేషన చైర్‌పర్సన కె.పార్వ తమ్మ, ఏపీ అర్బన డెవలప్‌మెంట్‌ కార్పొరేషన డైరెక్టర్‌ డి.రామాం జనే యులు, ఉలిందకొండ సింగింల్‌విండో అధ్యక్షుడు ఈవీరమణ, మాజీ ఎంపీపీ వాకిటి మాధవి, వాకిటి మాదేష్‌, ధనుంజయ, వెంక టేశ్వరరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Aug 31 , 2025 | 12:23 AM